Breaking News

బంగారం కొనుగోలుదారులకు ఊరట

Published on Thu, 04/25/2024 - 13:49

దేశవ్యాప్తంగా బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. పసిడి ధరలు ఈరోజు (ఏప్రిల్‌ 25) కాస్త తగ్గాయి. నిన్నటి రోజున భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు దిగొచ్చాయి.

హైదరాబాద్‌, విశాఖపట్నంలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.350 తగ్గి రూ.66,250 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ. 72,270 లకు తగ్గింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.350 తగ్గి రూ.66,400 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.380 తగ్గి రూ.72,420 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.350 క్షీణించి రూ.66,250 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.72,270 వద్దకు దిగొచ్చింది.

అలాగే చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200 తగ్గి రూ.67,100 ల​కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.220 తగ్గి రూ.73,200గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.350 క్షీణించి రూ.66,250 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.72,270 లకు తగ్గింది.

ఇక వెండి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా కాస్త తగ్గాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.400 తగ్గింది. ఇక్కడ ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.86,000గా ఉంది. 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)