Breaking News

పండక్కి ముందే ధరల మోత.. ఇలా అయితే బంగారం కొనడం కష్టమే!

Published on Tue, 10/22/2024 - 14:45

దీపావళి సమీపిస్తోంది, బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా ఏ మాత్రం తగ్గకుండా భారీగా పెరిగిన ధరల కారణంగా గోల్డ్ రూ. 80వేలకు చేరువయ్యింది. ఇదిలాగే కొనసాగితే.. పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు (మంగళవారం) దేశంలోని ప్రముఖ రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూసేద్దాం..

హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌, బెంగళూరు, ముంబైలలో.. నేడు 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రేటు రూ. 73,000 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ.79,640 వద్ద ఉంది. నిన్నటి ధరలు పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు. అంటే ఈ రోజు గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయన్నమాట.

చెన్నైలో కూడా గోల్డ్ రేటు ఈ రోజు నిశ్చలంగా ఉంది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,000 & 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 79,640 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధర నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగినట్లు స్పష్టమవుతోంది.

దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొంత అధికంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,150 & 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 79,790 వద్ద ఉంది.

ఇదీ చదవండి: నెట్టింట్లో చర్చకు దారితీసిన ట్వీట్

వెండి ధరలు
బంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. నిన్న, ఈ రోజు వెండి ధర రూ. 2500 పెరిగింది. దీంతో నేడు కేజీ సిల్వర్ రేటు రూ. 10,2000లకు చేరింది. వచ్చే వారమే పండుగ కాబట్టి ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)