Breaking News

ఊహించని రేటుకు చేరిన బంగారం.. అదే బాటలో వెండి

Published on Sat, 01/25/2025 - 10:51

రూ. 82,420కు చేరిన తులం బంగారం రేటు.. ఈ రోజు (జనవరి 25) అక్కడే స్థిరంగా ఉంది. దీంతో పసిడి రేట్లలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. అయితే ఈ కథనంలో మన దేశంలో ఏ నగరం గోల్డ్ రేటు ఎక్కువగా ఉంది?.. ఎక్కడ తక్కువగా ఉందనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా.. గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 75,550 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 82,420 వద్ద నిలిచాయి. నిన్న భారీగా పెరిగిన గోల్డ్ రేటు ఈ రోజు స్థిరంగా ఉంది.

చైన్నైలో కూడా బంగారం ధరలలో ఎటువంటి మార్పులు లేదు. కాబట్టి ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 75,550 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.  82,420 వద్ద ఉంది.

దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 75,700 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 82,570 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలలో ఎటువంటి మార్పు లేదని స్పష్టమవుతోంది. అయితే దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.

వెండి ధరలు (Silver Price)
బంగారం ధరలు మాత్రమే కాకుండా.. ఈ రోజు (శనివారం) వెండి ధరలలో కూడా ఎటువంటి మార్పు లేదు. కాబట్టి కేజీ సిల్వర్ రేటు రూ. 1,05,000 వద్ద ఉంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 97,500 వద్ద ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

ఇదీ చదవండి: డబ్బు లేకపోయినా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు: ఇలా..

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)