Breaking News

బంగారం తగ్గుముఖం.. శాంతించిన వెండి!

Published on Thu, 09/12/2024 - 11:52

దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. క్రితం రోజున గణనీయంగా  పెరిగిన పసిడి రేట్లు ఈరోజు  (సెప్టెంబర్‌ 12) స్వల్పంగా దిగొచ్చాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో బంగారం ధరలు నేడు ఎంత మేర తగ్గాయన్నది ఈ కథనంలో తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.67,050 వద్దకు వచ్చింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం రూ.100 కరిగి  రూ. 73,150 వద్దకు చేరింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ బంగారం ధరలు ఇదే స్థాయిలో స్వల్పంగా తగ్గాయి.

ఇదీ చదవండి: బ్యాంకులకు ఆరు రోజులు వరుస సెలవులు

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈరోజు పసిడి ధరల్లో తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.67,200 వద్దకు, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 100 క్షీణించి రూ.73,300 వద్ద​కు వచ్చింది.

వెండి ఇలా..
దేశవ్యాప్తంగా వెండి ధరల్లో గురువారం ఎలాంటి మార్పు లేదు. గత మూడు రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన వెండి రేట్లు ఈరోజు శాంతించాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.91,500 వద్ద కొనసాగుతోంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)