Breaking News

అమ్మకాల్లో 20 శాతం వృద్ధి 2023-24పై గోద్రెజ్‌ అప్లయన్సెస్‌

Published on Fri, 02/17/2023 - 15:48

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్థూల అమ్మకాలు 20 శాతం పెరిగి రూ. 6,200 కోట్లకు చేరగలవని గోద్రెజ్‌ అప్లయన్సెస్‌ అంచనా వేస్తోంది. ప్రీమియం ఉత్పత్తుల వాటా ప్రస్తుతమున్న 35 శాతం నుంచి 40 శాతానికి పెరగగలదని భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల అమ్మకాలు రూ. 5,200 కోట్లుగా ఉండగలవని అంచనా వేస్తున్నట్లు సంస్థ బిజినెస్‌ హెడ్, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కమల్‌ నంది చెప్పారు.

ఏసీల విభాగం అమ్మకాలు రెండింతలు పెరిగి రూ. 1,200 కోట్లకు చేరగలవని భావిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం కంపెనీ అమ్మకాల్లో ఏసీల వాటా 15 శాతంగా ఉండగా ఇది 22 శాతానికి చేరవచ్చని నంది చెప్పారు. కొత్తగా లీక్‌ ప్రూఫ్‌ ఎయిర్‌ కండీషనర్‌లను గురువారం ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. దీని ధర రూ. 48,900గా ఉంటుంది. ఈ వేసవిలో  కూలింగ్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ అధికంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

చైనా నుంచి సరఫరాల్లో అంతరాయాలు ఏర్పడిన నేపథ్యంలో ప్రస్తుతం చాలా మటుకు విడిభాగాలు, పరికరాలను దేశీయంగానే తయారు చేసుకోవడం పెరుగుతోందని నంది వివరించారు.

Videos

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

Photos

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం