Breaking News

దివాలా పిటిషన్‌ను త్వరగా తేల్చండి..ఎన్‌సీఎల్‌టీకి గో ఫస్ట్‌ విజ్ఞప్తి

Published on Tue, 05/09/2023 - 09:05

న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ గో ఫస్ట్‌ తాము స్వచ్ఛందంగా దాఖలు చేసిన దివాలా పిటిషన్‌పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)కి విజ్ఞప్తి చేసింది. విమానాలను లీజుకిచ్చిన సంస్థలు (లెస్సర్లు) వాటిని డీరిజిస్టర్‌ చేయడం మొదలుపెట్టాయని తెలిపింది. దీనితో గో ఫస్ట్‌ అభ్యర్థనను సత్వరం పరిశీలించేందుకు ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ అంగీకరించింది.

36 విమానాల రిజిస్ట్రేషన్‌ను ఉపసంహరించాల్సిందిగా కోరుతూ లీజింగ్‌ కంపెనీలు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ)ని కోరాయి. మరోవైపు, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు టికెట్ల బుకింగ్‌ చేపట్టవద్దంటూ కంపెనీని డీజీసీఏ ఆదేశించింది. అలాగే, సురక్షితమైన, విశ్వసనీయమైన విధంగా సర్వీసులు నడపడంలో విఫలం కావడంపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు సమాచారం. ఆ వివరణను బట్టి ఆపరేటర్‌ సర్టిఫికెట్‌ (ఏవోసీ)ని కొనసాగనివ్వడంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం ఫ్లయిట్‌ సేవలను నిలిపివేసిన గో ఫస్ట్‌.. మే 15 వరకూ టికెట్ల విక్రయాన్ని ఆపేసిన సంగతి తెలిసిందే. గో ఫస్ట్‌ గత 17 ఏళ్లుగా విమాన సేవలు నిర్వహిస్తోంది. అయితే, ప్రాట్‌ అండ్‌ విట్నీ (పీఅండ్‌డబ్ల్యూ) ఇంజిన్ల వైఫల్యం కారణంగా కొన్నాళ్లుగా సగానికి పైగా విమానాలను నడపడం లేదు. దీంతో ఆదాయం పడిపోయి, ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో కూరుకుపోవడం వల్ల దివాలా ప్రక్రియ చేపట్టాలంటూ ఎన్‌సీఎల్‌టీని కంపెనీ ఆశ్రయించింది. దీనిపై మే 4న విచారణ జరిపిన ట్రిబ్యునల్‌ .. ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది. రుణ దాతలకు గో ఫస్ట్‌ దాదాపు రూ. 11,463 కోట్లు చెల్లించాల్సి ఉంది. 

#

Tags : 1

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)