Breaking News

‘డిజిటల్‌ ఆవిష్కరణల్లో రాష్ట్రం అగ్రగామి’

Published on Tue, 11/12/2024 - 16:47

డిజిటల్ ఆవిష్కరణల్లో తెలంగాణ దూసుకుపోతోందని తెలంగాణ సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హిటాచీ లిమిటెడ్‌ ఆధ్వర్యంలోని డిజిటల్ ఇంజినీరింగ్‌ సేవలందించే గ్లోబల్‌లాజిక్ హైదరాబాద​్‌లో డెలివరీ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు హాజరై మాట్లాడారు.

‘గ్లోబల్‌లాజిక్ కొత్త డెలివరీ సెంటర్ ప్రారంభోత్సవం తెలంగాణ వృద్ధిని సూచిస్తోంది. ఇప్పటికే 220కి పైగా గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లు తెలంగాణలో ఉన్నాయి. డిజిటల్ ఇన్నోవేషన్, ట్రాన్స్‌ఫర్మేషన్‌లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుంది.  ఈ విభాగంలో ఏటా దాదాపు 2.5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అందులో 1.5 లక్షల మంది ఇంజినీర్లు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. దానివల్ల భవిష్యత్తులో మరింత మందికి స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. హైదరాబాద్‌లో డిజిటల్‌ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, వాటి కార్యకలాపాలను పెంపొందించడానికి గ్లోబల్‌లాజిక్‌ వంటి కంపెనీలకు ప్రభుత్వం సహకారం అందిస్తోంది’ అని మంత్రి అన్నారు.

ఇదీ చదవండి: నాలుగు లైన్ల పోస్ట్‌కు స్పందించి జాబ్ ఆఫర్‌!

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్లోబల్‌లాజిక్‌ ఏపీఏసీ మేనేజింగ్ డైరెక్టర్ పీయూష్ ఝా మాట్లాడుతూ..‘వివిధ రంగాల్లో ఇంజినీరింగ్ సామర్థ్యాలను పెంపొందించడానికి హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకోవడం సంతోషంగా ఉంది. కంపెనీకి గ్లోబల్ క్లయింట్‌లు పెరుగుతున్న నేపథ్యంలో వారి డిమాండ్లు తీర్చడానికి కొత్త కేంద్రంగా హైదరాబాద్‌ను ఎంచుకున్నాం. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, జనరేటివ్‌ ఏఐ వంటి న్యూఏజ్‌ టెక్నాలజీల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం. హైదరాబాద్‌ వంటి నగరంలో ప్రతిభకు కొరతలేదు. స్థానికంగా జీసీసీను ఏర్పాటు చేయడం వల్ల మా క్లయింట్లకు మెరుగైన సేవలందుతాయని భావిస్తున్నాం’ అన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)