Breaking News

చమురు వినియోగంపై ఈవీల ప్రభావం ఎంత..?

Published on Fri, 02/16/2024 - 12:25

భారతదేశానికి ఎంతోకాలంగా ముడి చమురు సరఫరా చేస్తున్న సౌదీ అరామ్‌కో దేశంలో మరింత పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్ టు కెమికల్స్ వ్యాపారంలో 20% వాటా కోసం 15 బిలియన్ డాలర్ల బిడ్ వేసి విఫలమైన సంగతి తెలిసిందే. తాజాగా పెట్రోకెమికల్స్‌ బిజినెస్‌లో ఆసక్తి కనబరుస్తున్నట్లు చెబుతుంది.

విద్యుత్‌ వాహనాలు పెరుగుతున్నా ప్రపంచంలో చమురు వినియోగం తగ్గదని చెబుతుంది. దాంతో ఇండియాలో మరింత వ్యాపారానికి ఆస్కారం ఉన్నట్లు సౌదీ అరామ్‌కోలో స్ట్రాటజీ అండ్ మార్కెట్ అనాలిసిస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫహద్ అల్ ధుబైబ్ ఓ మీడియాతో తెలిపారు. 

భారతదేశంలో జనాభా పెరుగుదలతోపాటు పారిశ్రామికీకరణ ప్రణాళికలు అధికమవుతున్నాయిని ధుబైబ్‌ అన్నారు. ‘గత రెండు దశాబ్దాలుగా భారత్‌ ఎంతో అభివృద్ధి చెందింది. 2050 వరకు దాదాపు 100 కోట్ల మంది ప్రజలు అధికంగా ఇంధనాన్ని వినియోగించనున్నారు. చమురుతోపాటు రానున్న రోజుల్లో పెట్రోకెమికల్స్‌లోనూ గణనీయమైన వృద్ధికి అవకాశం ఉంది. భారత్‌లో హైడ్రోకార్బన్లు, అవసరమైన రసాయనాలు, పదార్థాలను శుద్ధి చేయడంలో పెట్టుబడులు పెట్టేందుకు అరామ్‌కో పరిశీలిస్తుంది. భారతదేశానికి అరామ్‌కో ప్రధాన ఎల్‌పీజీ సరఫరాదారుగా ఉంది’ అని చెప్పారు. 

ఇదీ చదవండి: క్రూడాయిల్‌పై పన్ను పెంపు.. ఎంతో తెలుసా..

‘ఇప్పటికీ చాలామంది బయోమాస్ లేదా కలపను వినియోగించి వంట చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డేటా ప్రకారం ఏటా ఇంట్లో పొగవల్ల ఏర్పడే కాలుష్యం కారణంగా దాదాపు 4 మిలియన్ల మంది మరణిస్తున్నారు. ఇవి తగ్గాలంటే ప్రతి ఇంట్లో ఎల్‌పీజీ వినియోగించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తూ రెన్యువెబుల్‌ ఎనర్జీకి అయ్యే ఖర్చులను తగ్గించేందుకు కృషి చేయాలని అరామ్‌కో యోచిస్తోంది’ అని ధుబైబ్‌ తెలిపారు.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)