Breaking News

ఆ దేశాల్లో ఇండియన్‌ బైక్‌లకు యమా క్రేజ్‌..!

Published on Wed, 02/04/2026 - 21:29

సమాజంలో ఓ స్థాయి ఆర్థిక స్తోమత ఉన్నవారు ఇంపోర్టెడ్ బైకులు, కార్లు వాడడం తెలిసిందే..! అయితే.. ఆఫ్రికాలోని పేదదేశాలతోపాటు.. లాటిన్ అమెరికా వంటి దేశాల్లో సాధారణ ప్రజలు కూడా ఇంపోర్టెడ్ బైకులు వాడుతారంటే మీరు నమ్ముతారా? పేదరికం ఎక్కువగా ఉండే బుర్కినాఫాసో, ఐవరీ కోస్ట్, గ్వాటెమాలా, హోండురాస్ వంటి దేశాల్లో ఇంపోర్టెడ్ బైకులకు క్రేజ్ చాలా ఎక్కువ. సెకండ్ హ్యాండ్ బైక్‌లైనా.. విదేశీవే వాడుతారు. అయితే.. ఆ దేశాలకు బైక్‌లను ఎగుమతి చేసేది మాత్రం మన దేశమే..! నైజీరియా, కొలంబియా, బ్రెజిల్‌లోనూ భారత తయారీ బైకులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది.

43 లక్షల బైక్‌ల ఎగుమతి
భారత్‌లో ఎకానమీ ద్విచక్రవాహనాలు ఏ బ్రాండ్‌లో ఎక్కువగా ఉంటాయంటే.. ఠక్కున వచ్చే సమాధానాలు బజాజ్, హీరో, టీవీఎస్ అనే..! ఇప్పుడు ఆఫ్రికన్ దేశాల్లో ఈ వాహనాలకే అత్యధిక క్రేజ్ ఉంది. గత ఏడాది ఏకంగా 43 లక్షల ద్విచక్ర వాహనాలను భారత్ ఎగుమతి చేసింది. నైజీరియా, కొలంబియా, బ్రెజిల్ వంటి దేశాల్లో పౌరులు వాడే ప్రతీ 10 బైకుల్లో.. ఏడు మన దేశానికి చెందినవే..! నిజానికి ఒకప్పుడు ఈ ఘనతను జపాన్, చైనా తమ పేరిట నమోదు చేసుకున్నాయి. అయితే.. గడిచిన 15 ఏళ్లుగా భారత్ ఆ రికార్డులను తారుమారు చేస్తూ వస్తోంది.

వాస్తవానికి భారత్ నుంచి ద్విచక్ర వాహనాల ఎగుమతికి పెద్ద చరిత్రే ఉంది. రెండు దశాబ్దాల క్రితం వరకు ఈ రంగంలో చైనా ఆధిపత్యం ఉండేది. అంతకు ముందు జపాన్ బైకులకు క్రేజ్ ఉండేది. అయితే.. భారత్ వ్యూహాత్మకంగా ఆలోచించి, ఆఫ్రికన్ దేశాలకు బైకుల ఎగుమతిని ప్రారంభించింది. క్రమంగా ఈ ఎగుమతులను లాటిన్ అమెరికా, ఇతర ఆసియా దేశాలకు విస్తరించింది. ఇప్పుడు ఈ దేశాల్లో ఎలక్ట్రిక్ బైకుల విషయంలో చైనా జోరు ఉన్నా.. భారత్ దాన్ని కూడా క్రమంగా అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇందుకు అనేక కారణాలున్నాయి. జపాన్ బైకుల రేట్లు పెరిగాయి. చైనా బైకుల్లో నాణ్యతాపరమైన లోపాలు ఉంటున్నాయి. కానీ, భారత బైకులు మాత్రం అటు నాణ్యతాపరంగా.. ఇటు ధరలపరంగా ఆయా దేశాల పౌరుల మన్ననలు అందుకుంటున్నాయి. నిజానికి ఆయా దేశాల్లో జపాన్ బైకుల ధరలు 1500 డాలర్ల నుంచి 5 వేల డాలర్ల వరకు.. చైనా బైకుల ధరలు 800 డాలర్ల నుంచి 1200 డాలర్ల ఉన్నాయి. భారత్ మధ్యేమార్గంగా.. ఈ రెండిటికీ మధ్యలో 900 డాలర్ల నుంచి 1500 డాలర్ల మధ్య ధరలను నిర్ణయించి, ఆయా మార్కెట్లలోకి ప్రవేశించింది. నాణ్యత విషయంలో జపాన్ బైకులకు సమానంగా ఉండడంతో.. వీటికి ఆదరణ పెరిగింది.

ఆకట్టుకుంటున్న మోడల్స్
ఇక బైకుల మోడల్స్ విషయంలోనూ భారత్ ద్విచక్ర వాహనాలు ఆయా దేశాల వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. జపాన్ హోండా మాదిరి మోడళ్లను మన హీరో కంపెనీ తయారు చేస్తుండగా.. సుజికీ వంటి మోడళ్లను టీవీఎస్ రూపొందిస్తోంది. దీంతో.. జపాన్ బైకుల స్థానాన్ని భారత్ ఆక్రమించింది. చైనా బైకుల విషయానికి వస్తే.. చూడ్డానికి బాగానే ఉన్నా.. ఊరూపేరూ లేని కంపెనీలు కావడం.. విడిభాగాల సపోర్టు లేకపోవడంతో కొన్న ఏడాదికే అవి తుక్కుగా మారుతున్నాయనే విమర్శలు ఆయా దేశాల వినియోగదారుల నుంచి ఎదురవుతున్నాయి. దాంతో.. భారత్‌కు చెందిన హీరో, టీవీఎస్, బజాజ్ కంపెనీలు విదేశాలకు బైకుల ఎగుమతిలో ఆధిపత్యాన్ని సాధించాయి.

భారత బైకుల పట్ల మోజు పెరగడానికి కారణాల్లో అత్యంత కీలకమైనది సపోర్టింగ్..! మన కంపెనీలు ఆయా దేశాలకు నిరంతరాయంగా.. డిమాండ్‌ని బట్టి ఎయిర్ ఫిల్టర్, బ్రేక్ లైనర్లు, డిస్కులు, క్లట్చ్, గేర్ వైర్లు, కేబుళ్లను సరఫరా చేస్తాయి. అంతేకాదు.. అక్కడి డీలర్లకు నిరంతర సపోర్ట్‌ని అందజేస్తాయి. ఆయా దేశాల మెకానిక్‌లకు ప్రత్యేక శిక్షణ ఇస్తాయి. అందుకే అక్కడి డీలర్లు భారతీయ బైకులను ఆదరిస్తారు. ఒక్క పేద దేశాలే కాదు.. అమెరికాలో మన ఎన్‌ఫీల్డ్‌కు చాలా క్రేజ్ ఉంది. హార్లే-డేవిడ్సన్ డిమాండ్ ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో కూడా అమెరికాలో ఎన్‌ఫీల్డ్‌కు విపరీతమైన ఆదరణ ఉంది. అమెరికాలోని 47 రాష్ట్రాల్లో ఎన్‌ఫీల్డ్‌కు 152 డీలర్‌షిప్‌లు ఉండడం ఇందుకు నిదర్శనం. క్లాసిక్-350, హిమాలయన్-45, ఇంటర్‌సెప్టార్-650, కాంటినెంటల్ జీటీ-650, సూపర్ మెటియోర్-650 వంటి మోడళ్లను అమెరికన్లు ఆదరిస్తున్నారు. ఐరోపాలో కూడా హార్లే-డేవిడ్సన్‌కు మన బుల్లెట్ గట్టి పోటీని ఇస్తోంది. చూశారా.. విదేశీ మార్కెట్లలో భారత బైకుల హవా??

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)