Breaking News

ఆరు నగరాల్లో జీసీసీల జోరు

Published on Fri, 08/09/2024 - 05:51

న్యూఢిల్లీ: గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌ను (జీసీసీ) ఏర్పాటు చేయడానికి ఆరు ప్రధాన నగరాల్లో అంతర్జాతీయ సంస్థలు 2022 నుండి 2024 జూన్‌ మధ్య సుమారు 53 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. వీటిలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణే, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై ఉన్నాయి. ఈ కాలంలో లీజుకు తీసుకున్న మొత్తం ఆఫీస్‌ స్పేస్‌లో బెంగళూరు ఏకంగా 40 శాతం వాటా కైవసం చేసుకుంది. హైదరాబాద్‌కు 21, చెన్నైకి 14 శాతం వాటా ఉంది. 

ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సీబీఆర్‌ఈ, హైరింగ్‌ సొల్యూషన్స్‌ కంపెనీ జాయిన్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. జీసీసీలు ఇటీవలి కాలంలో తమ భారతీయ కార్యకలాపాలను గణనీయంగా విస్తరించాయి. నైపుణ్యం కలిగిన సిబ్బంది, తక్కువ వ్యయాలు, అనుకూల వ్యాపార వాతావరణం ఇందుకు కలిసి వచి్చంది. ఈ సెంటర్స్‌ వృద్ధి పథం భారత్‌లోని మొదటి ఆరు మెట్రోపాలిటన్‌ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంటుందని అంచనా. అసాధారణ ప్రతిభగల వ్యక్తులు వీటిని నడిపిస్తున్నారు. ఈ అంశం జీసీసీల విస్తరణ, భవిష్యత్తు అభివృద్ధికి వీలు కలి్పస్తుంది. దిగ్గజ కార్పొరేట్‌ కంపెనీలు తమ జీసీసీల కోసం పెద్ద ఎత్తున కార్యాలయ స్థలాలను సమకూర్చుకోవడం ద్వారా భారత్‌ పట్ల తమ దీర్ఘకాలిక నిబద్ధతను ధృవీకరిస్తున్నాయి. 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)