Breaking News

ఫార్మా కంపెనీ లాభాల పంట..

Published on Mon, 11/17/2025 - 07:54

ఔషధ రంగ కంపెనీ గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్‌(క్యూ2)లో నికర లాభం 72 శాతం జంప్‌చేసి రూ. 610 కోట్లను అధిగమించింది. యాబ్‌వీతో లైసెన్సింగ్‌ డీల్‌ ఇందుకు సహకరించింది.

ఐఎస్‌బీ 2001 ఇన్వెస్టిగేషనల్‌ అసెట్‌కు సంబంధించి యాబ్‌వీతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం లాభాలకు దోహదపడినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 354 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 3,434 కోట్ల నుంచి రూ. 6,047 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 3,001 కోట్ల నుంచి రూ. 3,895 కోట్లకు పెరిగాయి.  

లైసెన్సింగ్‌ దన్ను 
యాబ్‌వీతో కుదిరిన 192 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందంలో భాగంగా తాజా సమీక్షా కాలంలో 52.5 కోట్ల డాలర్ల ఆదాయం అందుకున్నట్లు గ్లెన్‌మార్క్‌ ఫార్మా వెల్లడించింది. కేన్సర్, ఆటోఇమ్యూన్‌ వ్యాధుల చికిత్స కోసం రూపొందిస్తోన్న ఐఎస్‌బీ 2001 కమర్షియలైజేషన్‌కు ఈ ఏడాది జూలైలో రెండు కంపెనీలు డీల్‌ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

దేశీయంగా ఫార్ములేషన్ల బిజినెస్‌ 87 శాతంపైగా పడిపోయి రూ. 165 కోట్లకు పరిమితంకాగా.. ఉత్తర అమెరికా ఆదాయం రూ. 741 కోట్ల నుంచి రూ. 4,466 కోట్లకు దూసుకెళ్లింది. ఇక యూరప్‌లో అమ్మకాలు 9 శాతం వృద్ధితో రూ. 746  కోట్లను తాకాయి. గత క్యూ2లో ఇవి రూ. 687 కోట్లుగా నమోదయ్యాయి.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)