Breaking News

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో జీహెచ్ఐఏఎల్ ఒప్పందం

Published on Thu, 12/05/2024 - 15:40

తెలంగాణ యువతకు ఏవియేషన్ స్కిల్ డెవలప్‌మెంట్‌ను పెంచేందుకు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం వివిధ విమానయాన శిక్షణా కార్యక్రమాలతో పాటు.. సర్టిఫికేషన్లను అందిస్తుంది. ఇది శ్రామిక నైపుణ్యాలను బలోపేతం చేయడానికి.. విమానయాన రంగంలో పెరుగుతున్న డిమాండ్లను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించినట్లు జీహెచ్ ఐఎఎల్  వెల్లడించింది

ఈ సందర్భంగా జిహెచ్ ఐఎఎల్ సిఇఒ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ.. "విమానయాన పరిశ్రమకు నైపుణ్యం కలిగిన నిపుణుల అవసరం చాలా ఉంది. ఈ భాగస్వామ్యం ద్వారా యువత ఉద్యోగావకాశాలు పొందుతారు. విమానయాన రంగానికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఈ కార్యక్రమం నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తుందని, రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలకు దారితీసే ప్రతిభా అంతరాలను పరిష్కరిస్తుందన్నారు. ప్రొఫెషనల్ క్యూరేటెడ్ కోర్సుల ద్వారా విమానయాన రంగంలో ఉన్నత శ్రేణి నైపుణ్యాలను అందించేందుకు జీఎంఆర్, వైఐఎస్‌యూల సంయుక్త కృషి రాష్ట్ర విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

అకడమిక్ క్రెడిట్లతో కూడిన సాంకేతిక నైపుణ్యాలు విద్యార్థులకు నిలువు మార్గాలు కల్పించడంతో పాటు అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగంలో తక్షణ ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణ వైస్ ఛాన్సలర్ విఎల్ విఎస్ ఎస్ సుబ్బారావు అన్నారు. ఈ భాగస్వామ్యం రాష్ట్రం.. దేశం కోసం విమానయాన పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి పనిచేయడానికి జిహెచ్ఐఎఎల్ యొక్క నిబద్ధతకు నిదర్శనం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)