Breaking News

రూ. 26999లకే ఐఫోన్ 15!

Published on Tue, 12/24/2024 - 21:17

అధిక ధరల కారణంగా యాపిల్ (Apple) ఐఫోన్ కొనుగోలు చేయలేకపోయిన వారికి 'ఫ్లిప్‌కార్ట్' (Flipkart) శుభవార్త చెప్పింది. ఇప్పుడు 'ఐఫోన్15'ను కేవలం రూ. 26,999లకే అందించనున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

డిస్కౌంట్ & ఎక్స్ఛేంజ్ ఆఫర్‌
నిజానికి యాపిల్ ఐఫోన్ 15 (iPhone 15) ధర రూ. 69,990. ఇది ఇప్పుడు 16 శాతం తగ్గింపుతో 58,499 రూపాయలకు లభిస్తుంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద గరిష్ఠగా రూ. 31,500 తగ్గింపు పొందవచ్చు. అంటే 58,499 రూపాయలలో.. 31,500 రూపాయలు తీసేస్తే.. రూ. 26,999 మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన ఐఫోన్ 15ను తక్కువ ధరలోనే కొనేయొచ్చు.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అనేది మీరు ఎక్స్‌ఛేంజ్ చేసే మొబైల్ ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద ఖచ్చితంగా రూ. 31,500 తగ్గింపు లభిస్తుందని అనుకోకూడదు.

ఇదీ చదవండి: అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.5000 రివార్డ్

ఐఫోన్ 15 డీటెయిల్స్
ఐఫోన్ 15 మొబైల్ 48 మెగాపిక్సెల్ కెమెరా పొందుతుంది. USB-C కనెక్టర్‌ను కలిగి మొట్ట మొదటి ఐఫోన్ మోడల్ ఇదే. ఇది హెక్సా-కోర్ యాపిల్ ఏ17 ప్రో చిప్‌ను కలిగి.. 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1 ఇంచెస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అంతే కాకుండా ఇది IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్, డ్యూయల్ సిమ్ ఫంక్షనాలిటీని కలిగి ఉంటుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)