జెన్‌ప్యాక్ట్‌ సీఈవో ‘టైగర్‌’ త్యాగరాజన్‌ రిటైర్మెంట్‌

Published on Thu, 11/09/2023 - 21:20

అంతర్జాతీయ ప్రొఫెషనల్‌ సేవల సంస్థ జెన్‌ప్యాక్ట్‌ ప్రెసిడెంట్‌, సీఈవో ‘టైగర్‌’ త్యాగరాజన్‌ రిటైర్ కాబోతున్నారు. త్యాగరాజన్‌ 2024 ఫిబ్రవరి 9న రిటైర్ కాబోతున్నట్లు జెన్‌ప్యాక్ట్‌ ప్రకటించింది.  తదుపరి సీఈవోగా బాలక్రిషన్‌ (బీకే) కల్రాను నియమిస్తున్నట్లు పేర్కొంది.

త్యాగరాజన్‌ అసలు పేరు ఎన్‌వీ త్యాగరాజన్‌. ఈ పేరును సంక్షిప్తం చేసి స్నేహితులు ఆయన్ను టైగర్‌ అని పిలిచేవారు. దీంతో ఆయనకు ‘టైగర్‌’ త్యాగరాజన్‌ అనే పేరు స్థిరపడింది. 2011లో జెన్‌ప్యాక్ట్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన త్యాగరాజన్‌ 2022 నాటికి ఆ కంపెనీని 4.3 బిలియన్‌ డాలర్ల ఆదాయంతో అగ్రగామిగా తీర్చిదిద్దారు. ‘టైగర్‌’ త్యాగరాజన్‌ డేటా అండ్‌ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించి క్లయింట్‌లకు మెరుగైన సేవలందించారని జెన్‌ప్యాక్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.

 

‘టైగర్‌’ త్యాగరాజన్‌ తర్వాత ఎవరిని సీఈవో చేయాలనే దానిపై జెన్‌ప్యాక్ట్‌ చాలా పెద్ద కసరత్తు చేసింది. కంపెనీలో ఉన్నవారితోపాటు పలువురు బయట వ్యక్తులను పరిశీలించిన కంపెనీ చివరకు అదే కంపెనీలో పలు కీలక విభాగాలకు నాయకత్వం వహిస్తున్న బీకే కల్రాను తదుపరి సీఈవోగా నియమించింది. ఈయన 1999లో జెన్‌ప్యాక్ట్‌లో చేరారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)