Breaking News

ప్రముఖ కంపెనీలో 1000 మందికి లేఆఫ్స్‌!

Published on Sat, 11/16/2024 - 12:30

ప్రముఖ కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,000 మందిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఉద్యోగాల కోతను ధ్రువపరుస్తూ జనరల్‌ మోటార్స్‌ ప్రకటన విడుదల చేసింది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. విద్యుత్‌ వాహనాల వృద్ధి కొనసాగుతుండడంతో ఈ విభాగంలో అధికంగా పెట్టుబడులు అవసరమవుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునేందుకు కంపెనీ ప్రయత్నిస్తుందని స్పష్టం చేసింది.

‘భవిష్యత్తులో విద్యుత్‌ వాహనాలకు భారీ గిరాకీ ఏర్పడనుంది. వాటి తయారీ, అందులో వాడే సాఫ్ట్‌వేర్‌కు అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాదిలోపు కంపెనీ వ్యయాలను రెండు బిలియన్‌ డాలర్ల (రూ.16,884 కోట్లు) నుంచి నాలుగు బిలియన్‌ డాలర్లు(రూ.33,768 కోట్లు) వరకు తగ్గించుకోవాలని లక్ష్యంగా నిర్ణయించాం. ఈ పోటీ మార్కెట్లో గెలవాలంటే వేగంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయాలి. నిర్వహణ వ్యయాలను తగ్గించుకుని, సామర్థ్యాల వినియోగాన్ని పెంచుకోవాలి. ఖర్చుల తగ్గింపులో భాగంగానే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నాం’ అని కంపెనీ ప్రకటనలో తెలిపింది.

ఇదీ చదవండి: ట్రంప్‌ ఎన్నికతో భారత్‌వైపు చూపు

ఆగస్టులో ఉద్యోగుల క్రమబద్ధీకరణ పేరుతో సాఫ్ట్‌వేర్ విభాగంలో పనిచేసే 1,000 కంటే ఎక్కువ మంది సిబ్బందిని గతంలో జనరల్‌ మోటార్స్‌ తొలగించింది. సెప్టెంబర్‌లో కాన్సాస్ తయారీ కర్మాగారంలో దాదాపు 1,700 మంది ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటించింది. 2023లో దాదాపు 5,000 మంది ఉద్యోగులను తొలగించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)