Breaking News

క్యూ2లో జీడీపీ వృద్ధి 7.2 శాతం

Published on Thu, 11/13/2025 - 18:08

న్యూఢిల్లీ: దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలోనూ (జూలై–సెప్టెంబర్‌) బలమైన పనితీరు చూపిస్తుందని, 7.2 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఇండ్‌–రా) అంచనా వేసింది. ప్రైవేటు వినియోగం కీలక చోదకంగా నిలుస్తుందని తెలిపింది.

క్రితం ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.6 శాతంగా ఉండడం గమనార్హం. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేయడం తెలిసిందే. క్యూ2 జీడీపీ గణాంకాలు ఈ నెల 28న విడుదల కానున్నాయి. ‘‘ఉన్నత, మధ్యాదాయ వర్గాల వారికి ఆదాయం స్థిరంగా పెరుగుతుండడం ప్రైవేటు వినియోగానికి కీలక చోదకంగా నిలుస్తుంది. సేవల రంగం బలమైన పనితీరు, వస్తు ఎగుమతుల పెరుగుదల జీడీపీ వృద్ధిని మరింత పైకి తీసుకెళుతుంది’’అని ఇండ్‌–రా ఆర్థికవేత్త పరాస్‌ జస్రాయ్‌ పేర్కొన్నారు.

దేశీ డిమాండ్‌ బలంగా ఉండడం, ఆర్‌బీఐ అంచనాలకంటే వేగంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం వేతన వృద్ధికి, వినియోగానికి మద్దతుగా నిలుస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ప్రైవేటు వినియోగం క్యూ2లో 8 శాతం వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ2లో 6.4 శాతం వృద్ధి నమోదు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఇది 7 శాతం పెరిగినట్టు తెలిపింది. ఆదాయపన్ను తగ్గింపులు సైతం వినియోగానికి మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది.

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)