Breaking News

6.7 శాతం వరకూ వృద్ధి 

Published on Mon, 05/27/2024 - 08:56

న్యూఢిల్లీ: భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో  6.1–6.7 శాతం పరిధిలో వృద్ధి చెందుతుందని పలువురు ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. నాల్గవ త్రైమాసికానికి (జనవరి–మార్చి 2024) అలాగే మొత్తం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడీపీ తొలి అధికారిక గణాంకాలు  మే 31న ప్రభుత్వం విడుదల చేయనున్న నేపథ్యంలో తాజా అంచనాలు వెలువడుతున్నాయి. ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.6–7.8 శాతం శ్రేణిలో ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థ 2023–24 జూన్‌ త్రైమాసికంలో 8.2 శాతం, సెపె్టంబర్‌ త్రైమాసికంలో 8.1 శాతం,  డిసెంబర్‌ త్రైమాసికంలో 8.4 శాతం పురోగతి సాధించింది. 

కీలక రంగాల పటిష్ట వృద్ధి
కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ చీఫ్‌ ఎకనామిస్ట్‌ ఉపాస్న భరద్వాజ్‌ ఎకానమీ పరిస్థితులపై మాట్లాడుతూ, కీలక రంగాలకు సంబంధించి హై ఫ్రీక్వెన్సీ డేటా విస్తృత ప్రాతిపదికన బలమైన వృద్ధిని సూచిస్తోందని తెలిపారు. అలాగే నాల్గవ త్రైమాసికంలో వాణిజ్యం,  హోటళ్ల రంగం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ‘‘తయారీ రంగం కార్యకలాపాలు కూడా బాగున్నాయి. నిర్మాణ ఆధారిత, పెట్టుబడి విభాగాల నుంచి మెరుగైన ఫలితాలు రావాలి.  అయితే వ్యవసాయ రంగం వృద్ధి వెనుకబడి ఉండవచ్చు. నాల్గవ త్రైమాసికంలో 6.1 శాతం జీడీపీ వృద్ధిని మేము ఆశిస్తున్నాము. పూర్తి సంవత్సరం సంఖ్య 7.6 శాతానికి దగ్గరగా ఉంటుందని అనుకుంటున్నాం’’ అని భరద్వాజ్‌ చెప్పారు. కాగా, క్యూ4లో 6.5 శాతం, ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతం వృద్ధిని అంచనావేస్తున్నట్లు ఈవై ఇండియా చీఫ్‌ పాలసీ అడ్వైజర్‌ డీకే శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఇక ఇండియా రేటింగ్స్‌ క్యూ4 అంచనా 6.2 శాతంగా ఉంది. దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా క్యూ4లో 6.7 శాతం, ఆర్థిక సంవత్సరం 7.8 శాతం వృద్ధి అంచనాలను వెలువరిస్తోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అంచనా ఆర్థిక సంవత్సరానికి 7 శాతంగా ఉంది.    

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)