జీడీపీ గణాంకాలే దిక్సూచి

Published on Tue, 11/28/2023 - 01:17

న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రధానంగా దేశ ఆర్థిక పురోగతి గణాంకాలపై ఆధారపడి కదిలే వీలుంది. ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికానికి స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వివరాలు గురువారం(30న) వెల్లడికానున్నాయి. అక్టోబర్‌ నెలకు మౌలిక సదుపాయాల గణాంకాలు సైతం ఇదే రోజు విడుదలకానున్నాయి. గురునానక్‌ జయంతి సందర్భంగా సోమవారం మార్కెట్లకు సెలవుకావడంతో ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది.

కాగా.. గురువారం నవంబర్‌ డెరివేటివ్స్‌ సిరీస్‌ గడువు ముగియనుంది. శుక్రవారం(డిసెంబర్‌ 1న) తయారీ రంగ పనితీరు వెల్లడించే నవంబర్‌ పీఎంఐ ఇండెక్స్‌ వివరాలు తెలియనున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కోవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. స్థూల ఆర్థిక గణాంకాలతోపాటు, విదేశీ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులకు అనుగుణంగా ట్రెండ్‌ ఏర్పడే అవకాశమున్నట్లు పేర్కొంటున్నారు.  

ఇతర అంశాలూ కీలకమే..
ఆరు ప్రధాన కరెన్సీలతో డాలరు మారకంతోపాటు.. దేశీయంగా రూపాయి కదలికలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా పేర్కొన్నారు. గత వారం డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 83.38వరకూ నీరసించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ముడిచమురు ధరలు, యూఎస్‌ బాండ్ల ఈల్డ్స్‌కు సైతం ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు మీనా తెలియజేశారు.

నవంబర్‌ నెలకు వాహన విక్రయ గణాంకాలు వెల్లడికానున్న నేపథ్యంలో వారాంతాన ఆటో రంగ దిగ్గజాలు వెలుగులో నిలిచే వీలున్నట్లు మాస్టర్‌ క్యాపిటల్‌ సరీ్వసెస్‌ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ అర్వీందర్‌ సింగ్‌ నందా తెలియజేశారు. వీటికితోడు యూఎస్‌ జీడీపీ, యూఎస్‌ పీఎంఐ, చమురు నిల్వలు, యూరోజోన్‌ సీపీఐ తదితర గణాంకాలు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేíÙంచారు.  

వడ్డీ రేట్ల ప్రభావం  
గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్పంగా బలపడ్డాయి. హెచ్చుతగ్గుల మధ్య నికరంగా సెన్సెక్స్‌ 175 పాయింట్లు, నిఫ్టీ 63 పాయింట్లు చొప్పున పుంజుకున్నాయి. అయితే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు లేదా పెట్టుబడులు ఈ వారం కొంతమేర ప్రభావం చూపనున్నట్లు మీనా పేర్కొన్నారు.

యూఎస్‌లో అంచనాలకంటే అధికంగా ద్రవ్యోల్బణం తగ్గడంతో మార్కెట్లలో విశ్వాసం నెలకొననున్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఇది కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు యోచనను అడ్డుకోవచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో పదేళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్‌ రెండు వారాల క్రితం నమోదైన 5 శాతం నుంచి 4.4 శాతానికి దిగివచ్చాయి. వెరసి దేశీ ఈక్విటీలలో ఎఫ్‌పీఐల అమ్మకాలు నెమ్మదించవచ్చని తెలియజేశారు. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)