Breaking News

జీసీసీ లీజింగ్‌.. రికార్డ్‌

Published on Fri, 04/10/2026 - 08:12

విదేశీ సంస్థలు భారత్‌లో గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల (జీసీసీలు) ఏర్పాటుకు పోటీ పడుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 9.1 మిలియన్‌ చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) కార్యాలయ స్థలాలను (ఆఫీస్‌ స్పేస్‌) జీసీసీల ఏర్పాటుకు విదేశీ సంస్థలు టాప్‌–9 నగరాల్లో తీసుకున్నట్టు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సీబీఆర్‌ఈ తెలిపింది.

ఒక త్రైమాసికంలో జీసీసీలకు సంబంధించి ఇదే గరిష్టమని పేర్కొంది. మార్చి త్రైమాసికంలో ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ ఈ నగరాల్లో 5 శాతం పెరిగి 20.7 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి చేరింది. 2025 మొదటి మూడు నెలల్లో ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ 19.7 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నై, ముంబై, పుణె, ఢిల్లీ ఎన్‌సీఆర్, కోల్‌కతా, అహ్మదాబాద్, కోచి నగరాల డేటాను ఈ నివేదికలో సీబీఆర్‌ఈ ప్రస్తావించింది.

జీసీసీ లీజింగ్‌ లావాదేవీలు రికార్డు స్థాయిలో నమోదు కావడం అన్నది సంక్లిష్టమైన సామర్థ్య కార్యకలాపాలకు భారత్‌ అంతర్జాతీయ కేంద్రంగా అవతరిస్తుండడానికి సంకేతమని సీబీఆర్‌ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్‌ మేగజిన్‌ తెలిపారు. ఏదో ఒక రంగానికే ఈ డిమాండ్‌ పరిమితం కాలేదని, ఈ–కామర్స్, టెక్నాలజీ, బీఎఫ్‌ఎస్‌ఐ ఇలా ఎన్నో రంగాల్లో నెలకొన్నట్టు చెప్పారు.  

అమెరికా సంస్థలే ముందు.. 
టాప్‌–9 నగరాల్లో జీసీసీలకు సంబంధించి తీసుకున్న లీజింగ్‌లో 73 శాతం అమెరికా సంస్థల నుంచే ఉన్నట్టు సీబీఆర్‌ఈ నివేదిక వెల్లడించింది. పర్యావరణ అనుకూలమైన సర్టిఫికేషన్, మెరుదైన సదుపాయాలు ఉన్న వాటికి కిరాయిదారులు ప్రాధాన్యమిస్తున్నట్టు సీబీఆర్‌ఈ ఎండీ (లీజింగ్‌ సర్వీసెస్‌) రామ్‌ చందానీ తెలిపారు.

జీసీసీలు బహుళ కార్యకలాపాలకు సంబంధించి ఆవిష్కరణల కేంద్రాలుగా మారుతున్నాయని, ఏఐ అనుకూల కార్యాలయ వ్యూహాలను సంస్థలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. టాప్‌–9 నగరాల్లో బెంగళూరులో ఆఫీస్‌ లీజింగ్‌ 29 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ 22 శాతం, ముంబైలో 16 శాతం వాటా కలిగి ఉన్నాయి. జనవరి–మార్చి త్రైమాసికంలో టాప్‌–9 నగరాల్లోని కార్యాలయ స్థలాల మొత్తం లీజింగ్‌లో ఈ మూడు నగరాల వాటాయే 67 శాతం ఉండడం గమనార్హం.

Videos

వాటర్ తో గేమ్స్ వద్దు.. ఒక సెల్ఫీ మూడు ప్రాణాలు

నల్లగా ఉన్నాడని లవర్తో మొగుణ్ణే లేపించేసింది

మోనాలిసాకు బిగ్ షాక్ భర్త ఫర్మాన్ ఖాన్పై పోక్సో కేసు

మీ అన్నను చంపించింది నువ్వే అని టాక్... అచ్చెన్నకు గుబాపగిలేలా సజ్జల కౌంటర్

వేసిన 20 రోజులకే ఖతం చేతులతో తవ్వితే ఊడిపోతున్న రోడ్డు

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

చిరు ఆగ్రహం

హరూజ్ జలసంధిలో ఇరాన్ కొత్త రూల్స్

MAVIGUN పై షర్మిల జోకర్ కామెంట్స్ సజ్జల సెటైర్స్ అదుర్స్

ఎర్రంనాయుడు మరణంలో నీ హస్తం లేదా? అచ్చెన్న పై తమ్మినేని సీతారాం షాకింగ్ నిజాలు

Photos

+5

గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతామహాలక్ష్మిలా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

తిమ్మరాజుపల్లి టీవీ.. వెరైటీగా ట్రైలర్‌ లాంచ్‌ (ఫోటోలు)

+5

మిస్‌ తెలుగు యూఎస్‌ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)

+5

తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)

+5

సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)

+5

గుర్తుకొస్తున్నాయి.. మహానేత పాదయాత్రకు 23 ఏళ్లు (చిత్రాలు)

+5

ఈ సినిమా ఎంతో స్పెషల్‌ అంటున్న కృతీ శెట్టి (ఫోటోలు)