Breaking News

గౌతమ్ అదానీ జీతం ఎంతో తెలుసా?

Published on Sun, 06/23/2024 - 16:42

ప్రముఖ వ్యాపారవేత్త, భారతీయ కుబేరుడు 'గౌతమ్ అదానీ' గురించి అందరికి తెలుసు. ఆసియా సంపన్నుల జాబితాలో ఒకరుగా ఉన్న ఈయన.. అదానీ గ్రూపులో పనిచేసే ఇతర ఉన్నత స్థాయి ఉద్యోగుల కంటే తక్కువ జీతం తీసుకుంటున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

భారతదేశంలోని ఇతర పారిశ్రామక వేత్తల జీతాలతో పోలిస్తే.. అదానీ జీతం చాలా తక్కువ. కరోనా మహమ్మారి సమయంలో ముకేశ్ అంబానీ జీతం తీసుకోవడం మానేశారు. అంతకు ముందు ఈయన వార్షిక వేతనం రూ.15 కోట్లుగా ఉండేది. భారతి ఎంటర్​ప్రైజెస్ వ్యవస్థాపకులు సునీల్ భారతి మిట్టల్ 2022లో రూ. 16.7 కోట్లు వార్షిక వేతనంగా తీసుకున్నారు. బజాజ్ ఆటో కంపెనీకి చెందిన రాజీవ్ బజాజ్, పవన్ ముంజాల్.. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ జీతం కూడా అదానీ జీతం కంటే చాలా తక్కువ.

అదానీ సంస్థలో పనిచేసే ఏఈఎల్ బోర్డు డైరెక్టర్‌గా పనిచేస్తున్న వినయ్ ప్రకాష్ వార్షిక వేతనంగా మొత్తం 89.37 కోట్ల రూపాయలను అందుకున్నారు. గ్రూప్ సీఎఫ్ఓ జుగేషీందర్ సింగ్ వేతనం రూ.9.45 కోట్లు. దీన్ని బట్టి చూస్తే తన సంస్థలో పనిచేసేవారి జీతం కంటే.. అదానీ తక్కువ జీతం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

2024 మార్చి 31తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో గౌతమ్ అదానీ తీసుకున్న జీతం రూ. 9.26 కోట్లు. ఈ జీతం భారతదేశంలోని ఇతర పారిశ్రామిక వేత్తలకంటే తక్కువని తెలుస్తోంది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (AEL) నుంచి 2023-24లో అదానీ తీసుకున్న జీతం రూ. 2.19 కోట్లు, దీనితో పాటు రూ. 27 లక్షల విలువైన అలవెన్సులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తం మీద అదానీ ఎంటర్​ప్రైజెస్ ఈయన తీసుకున్న జీతం రూ. 2.19 కోట్లు. అదానీ పోర్ట్స్, ఎస్ఈజెడ్ లిమిటెడ్ నుంచి రూ.6.8 కోట్లు జీతంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)