మారిన అంబానీ ప్లేస్.. ఆసియా కుబేరుడిగా అదానీ!

Published on Sun, 06/07/2026 - 16:28

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మరోసారి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్‌టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. అదానీ గ్రూప్‌కు చెందిన పలు కంపెనీల షేర్లు భారీగా పెరగడంతో ఆయన సంపద గణనీయంగా వృద్ధి చెందింది. దీంతో ఆసియా ధనవంతుల జాబితాలో అగ్రస్థానాన్ని ఆయన తిరిగి కైవసం చేసుకున్నారు.

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ఒక్క రోజులోనే అదానీ సంపద సుమారు 2.5 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన మొత్తం నికర ఆస్తుల విలువ 89.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ పెరుగుదలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీను అధిగమించి అదానీ మళ్లీ మొదటి స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం అంబానీ సంపద 88 బిలియన్ డాలర్లుగా ఉండగా, సాఫ్ట్‌బ్యాంక్ వ్యవస్థాపకుడు మసయోషి సన్‌ సంపద 87 బిలియన్ డాలర్లుగా నమోదైంది.

అదానీ సంపద పెరగడానికి ప్రధాన కారణం అదానీ గ్రూప్‌కు చెందిన కంపెనీల షేర్లలో నమోదైన భారీ ర్యాలీ. ముఖ్యంగా అదానీ పవర్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు మంచి లాభాలను నమోదు చేశాయి. వీటిలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు దాదాపు 6.9 శాతం పెరగగా, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేరు 3.8 శాతం లాభపడింది.

గత నెల రోజుల వ్యవధిలో అదానీ సంపద దాదాపు 10 బిలియన్ డాలర్లు పెరిగినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. ఇటీవల అదానీ గ్రూప్‌పై నమోదైన మోసం ఆరోపణలకు సంబంధించిన కేసులను అమెరికా న్యాయశాఖ విరమించుకున్న తర్వాత పెట్టుబడిదారుల విశ్వాసం మరింత పెరిగిందని నివేదిక తెలిపింది. అయితే.. ఆ ఆరోపణలను అదానీ, ఆయన సహచరులు మొదటి నుంచే ఖండించారు.

ప్రస్తుతం అదానీ గ్రూప్‌కు చెందిన ఆరు ప్రధాన లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ కలిపి సుమారు 191 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది గ్రూప్ వ్యాపార సామర్థ్యాన్ని, మార్కెట్లో ఉన్న బలమైన స్థానాన్ని ప్రతిబింబిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం వివిధ ఆరోపణలు, మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా అదానీ గ్రూప్ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంది. అయితే.. ప్రస్తుతం కంపెనీల పనితీరు మెరుగుపడటం, షేర్ల ధరలు పుంజుకోవడం వల్ల గౌతమ్ అదానీ మళ్లీ ప్రపంచ ధనవంతుల జాబితాలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడమే కాకుండా, ఆసియాలో అత్యంత సంపన్నుడిగా నిలిపాయి.

Videos

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)