ఆసియాకు కొత్త కుబేరుడు.. ముఖేష్‌ అంబానీ నెం.2

Published on Fri, 04/17/2026 - 20:51

ఆసియా అత్యంత సంపన్నుడుగా అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ నిలిచారు. ఇప్పటి వరకూ ఆసియా కుబేరుడిగా ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముఖేష్‌ అంబానీని వెనక్కి నెట్టి ఆయన స్థానాన్ని అదానీ ఆక్రమించారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ తాజా గణాంకాల ప్రకారం.. గౌతమ్‌ అదానీ నికర సంపద 92.6 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. దీంతో ఆయన అత్యంత సంపన్నుల్లో ఆసియాలో అగ్ర స్థానానికి, ప్రపంచంలో 19 ప్లేస్‌కు చేరుకున్నారు.

చాలా కాలం ఆసియా అత్యంత సంపన్నుడుగా కొనసాగిన ముఖేష్‌ అంబానీ 90.8 బిలయన్‌ డాలర్ల సంపదతో  ఆసియాలో రెండో స్థానానికి, ప్రపంచవ్యాప్తంగా 20వ స్థానానికి పరిమితమయ్యారు. వీరి సంపద మధ్య అంతరం తక్కువగా ఉన్నప్పటికీ, ఈ మార్పు ప్రపంచ సంపద కదలికల అస్థిర స్వభావాన్ని తెలియజేస్తోంది.

అంబానీ vs అదానీ: లాభాలు.. నష్టాలు
ఈ సంవత్సరం తన గ్రూప్ స్టాక్ పనితీరులో స్థిరమైన లాభాలు అదానీ సంపద పెరుగుదలకు కలిసొచ్చాయి. సంపదకు 8.1 బిలియన్ డాలర్లు జత కలిశాయి. దీనికి విరుద్ధంగా, అంబానీ అదే కాలంలో తన నికర సంపదలో 16.9 బిలియన్ డాలర్లను కోల్పోయారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం ఫ్లాట్ మార్కెట్ పనితీరును కనబరిచింది. దీంతో అంబానీ సంపద 76.7 మిలియన్ డాలర్ల స్వల్ప పెరుగుదలను చూసింది. అదే సమయంలో అదానీ గ్రూప్ స్టాక్స్ లాభాలను నమోదు చేశాయి. దీంతో కేవలం ఒక రోజులో అదానీ సంపదకు 3.56 బిలియన్ డాలర్లు జత కలిశాయి.

ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే..
ఎలాన్ మస్క్ 656 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, లారీ పేజ్ 286 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. టాప్ 10 లో జెఫ్ బెజోస్, సెర్గీ బ్రిన్, మార్క్ జుకర్ బర్గ్, లారీ ఎల్లిసన్, మైఖేల్ డెల్, జెన్సన్ హువాంగ్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, జిమ్ వాల్టన్ ఉన్నారు.

Videos

ఏపీ అభివృద్ధికి తారకమంత్రం.. ప్రజల్లో మావిగన్ క్రేజ్

మళ్లీ అదే కథ! పరాజయాల వైపు KKR

అంబటి రాంబాబు నిరాహార దీక్ష

ఇరాన్ గుడ్ న్యూస్.. తెరుచుకున్న హార్ముజ్

దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టాలపై YS జగన్ సంచలన పోస్ట్

వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. వరుదు కళ్యాణి రియాక్షన్

మోదీకి బిగ్ షాక్.. పార్లమెంట్ లో ఎదురుదెబ్బ..

జనగణన పూర్తి కాకుండానే డీలిమిటేషన్ బిల్లు.. దక్షిణాదికి జరిగే నష్టం ఇదే!

కూకట్ పల్లిలో ఘోర బస్సు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

గెలవదని తెలిసే బిల్లు విషయంలో ముందుకెళ్లారా?

Photos

+5

సిద్ధార్థ్‌ బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)

+5

'పాపం ప్రతాప్' మూవీ థ్యాంక్ యూ మీట్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. ధనా ధన్‌ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో సరదాగా టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర (ఫోటోలు)

+5

ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనితా బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి అభినయ పెళ్లికి ఏడాది.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫోటోలు)

+5

భూత్‌ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్‌ (ఫోటోలు)

+5

కోహ్లీ లైక్‌ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)

+5

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)

+5

భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)