America: పోలీసుల చేతిలో యువకుడు హతం
Breaking News
గేమింగ్ చట్టం అమలు అప్పుడే: అశ్విని వైష్ణవ్
Published on Fri, 09/19/2025 - 10:22
ఆన్‌లైన్ మనీ గేమ్స్‌ను నిషేధిస్తూ రూపొందించిన ఆన్‌లైన్ గేమింగ్ చట్టం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దీనిపై గత మూడేళ్లుగా పరిశ్రమ వర్గాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందని, చట్టాన్ని ఆమోదించిన తర్వాత కూడా బ్యాంకులు, ఇతరత్రా భాగస్వాములతోను చర్చించామని ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026 ఇండియాకి సంబంధించి ప్రీ–ఈవెంట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు.
పార్లమెంటు గత నెలలో ఈ చట్టానికి ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీనితో డ్రీమ్11, మై11 సర్కిల్, విన్‌జో, జూపీ, పోకర్‌బాజీలాంటి సంస్థలు రియల్ మనీ గేమింగ్ కార్యకలాపాలను నిలిపివేశాయి. కాగా, కృత్రిమ మేథ (ఏఐ) సంబంధిత ముప్పుల నుంచి ప్రజలకు రక్షణ కలి్పంచేందుకు, ఏఐ వినియోగ విధి విధానాలను నిర్దేశించేందుకు ఉద్దేశించిన గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్‌ను సెపె్టంబర్ 28 నాటికి విడుదల చేయనున్నట్లు వైష్ణవ్ చెప్పారు.
Tags : 1