Breaking News

2025లో ఐపీవోల సెంచరీ 

Published on Fri, 12/12/2025 - 05:02

ప్రస్తుత కేలండర్‌ ఏడాది(2025) ముగింపునకు వచ్చింది. విశేషమేమిటంటే ప్రైమరీ మార్కెట్లలో ఒక కొత్త చరిత్ర నమోదైంది. పబ్లిక్‌ ఇష్యూల ద్వారా అత్యధికంగా రూ. 1.7 లక్షల కోట్లను కంపెనీలు సమీకరించాయి. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. 2024లోనూ రూ. 1.59 లక్షల కోట్లతో రికార్డ్‌ నెలకొల్పడం గమనార్హం! ఇక దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ ఏడాది ఐపీవోలు సెంచరీ కొట్టడం విశేషం! వివరాలు చూద్దాం..   

మెయిన్‌బోర్డ్‌లో లిస్టింగ్‌కు కంపెనీలు క్యూ కడుతుండటంతో రెండేళ్లుగా ప్రైమరీ మార్కెట్లు కదం తొక్కుతున్నాయి. ఓవైపు సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొంటున్నప్పటికీ పబ్లిక్‌ ఇష్యూల వెల్లువ కొనసాగుతోంది! అయితే ఆటుపోట్ల మధ్య ప్రామాణిక ఇండెక్సులు సెన్సెక్స్,  నిఫ్టీ సరికొత్త గరిష్టాలకు చేరడం విశేషం! కాగా.. తాజాగా పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన పార్క్‌ మెడి వరల్డ్, కరోనా రెమిడీస్, నెఫ్రోప్లస్‌ హెల్త్, వేక్‌ఫిట్‌ ఇన్నోవేషన్స్‌తో 2025లో ప్రైమరీ మార్కెట్లు సెంచరీ కొట్టాయి. 2007 తరువాత ఇది రికార్డ్‌కాగా.. తద్వారా రూ. 1.7 లక్షల కోట్లను సమీకరించడం ద్వారా కొత్త చరిత్రను లిఖించాయి. ఈ బాటలో వచ్చే వారం ఐపీవో ద్వారా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ రూ. 10,000 కోట్లు సమీకరించనుండటం విశేషం!  

రికార్డులతో రెండేళ్లు 
ప్రైమరీ మార్కెట్లలో సరికొత్త రికార్డ్‌ నెలకొల్పుతూ గత కేలండర్‌ ఏడాదిలో 91 కంపెనీలు రూ. 1.59 లక్షల కోట్లను సమీకరించాయి. ప్రస్తుత ఏడాది జోరు మరింత పెరిగి ఐపీవోల సెంచరీ మోత మోగింది. తద్వారా రూ. 1.7 లక్షల కోట్ల సమీకరణతో కొత్త చరిత్రను సైతం నెలకొల్పాయి. నిజానికి గత వారాంతానికల్లా 96 ఇష్యూలు రూ. 1.6 లక్షల కోట్లను సమీకరించడం ద్వారా 2024ను అధిగమించాయి. ఏడాది ముగిసేసరికి ఐసీఐసీఐ ప్రు ఏఎంసీ, కేఎస్‌హెచ్‌ ఇంటర్నేషనల్‌ తదితర ఇష్యూలతో ఈ రికార్డులు మరింత మెరుగుపడనున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకు ప్రధానంగా రిటైల్‌ విభాగంసహా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) నుంచి పెట్టుబడులు వెల్లువెత్తుతుండటం సహకరిస్తున్నట్లు తెలియజేశారు. 

పీఈ సంస్థలకు ఓకే 
ఈ ఏడాది టాటా క్యాపిటల్, ఎల్‌జీ ఎల్రక్టానిక్స్, లెన్స్‌కార్ట్, బిలియన్‌బ్రెయిన్స్‌ గ్యారేజ్‌ వెంచర్స్‌(గ్రో) తదితర భారీ ఇష్యూలు విజయవంతమయ్యాయి. దీంతో పీఈ దిగ్గజాలకు లాభదాయక ఎగ్జిట్‌ అవకాశాలు లభిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇది ఐపీవోలకు మరింత ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది 96 ఇష్యూలలో 80 లాభాలతో లిస్ట్‌కాగా.. కొన్ని కంపెనీలు 75 శాతం ప్రీమియం సాధించడం విశేషం! వెరసి రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు వివరించారు.

సవాళ్లలోనూ గుడ్‌ 
యూఎస్‌ టారిఫ్‌ల విధింపు, ప్రపంచవ్యాప్త రాజకీయ భౌగోళిక అస్థిరతలు, ఓమాదిరి కార్పొరేట్‌ ఫలితాలు వంటి ప్రతికూలతల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ ఏడాది అధిక శాతం అమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయినప్పటికీ దేశీ ఫండ్స్, రిటైలర్ల భారీ పెట్టుబడులతో ప్రైమరీ మార్కెట్లు మాత్రం కళకళలాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూలై, ఆగస్ట్‌లలో నిఫ్టీ, మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు నీరసించినప్పటికీ ఐపీవో ద్వారా 25 కంపెనీలు రూ. 26,579 కోట్లు సమీకరించాయి. ఈ బాటలో ఒక్క సెపె్టంబర్‌లోనే 1997 జనవరి తదుపరి అత్యధికంగా 25 కంపెనీలు లిస్టింగ్‌కు క్యూ కట్టాయి.

దిగ్గజాల లిస్టింగ్‌ 
కంపెనీ పేరు    ఇష్యూ విలువ 
టాటా క్యాపిటల్‌    15,512 
హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌    12,500 
ఎల్‌జీ ఎల్రక్టానిక్స్‌    11,604 
ఐసీఐసీఐ ప్రు ఏఎంసీూ     10,603 
బిలియన్‌బ్రెయిన్స్‌     6,632 
(విలువ రూ. కోట్లలో) (ూ ఈ నెల 19న లిస్ట్‌కానుంది)  

  –సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)