Breaking News

ఇన్వెస్టర్లూ.. ఇవిగో కొత్త ఫండ్‌లు

Published on Mon, 08/18/2025 - 08:44

యూనియన్‌ మ్యుచువల్‌ ఫండ్‌ సంస్థ తాజాగా డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఆల్‌ క్యాప్‌ యాక్టివ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌వోఎఫ్‌)ను ఆవిష్కరించింది. ఇది సెప్టెంబర్‌ 1న ప్రారంభమై 15న ముగుస్తుంది. ఈ ఎఫ్‌వోఎఫ్‌ ప్రధానంగా యూనియన్‌ ఎంఎఫ్‌కి చెందిన లార్జ్, మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఈక్విటీ స్కీముల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది.

దీనితో మార్కెట్‌ టైమింగ్, దేనికి ఎంత కేటాయించాలి, ఒక ఫండ్‌ నుంచి మరో ఫండ్‌కి మారేటప్పుడు పడే పన్ను ప్రభావాలు మొదలైన వాటి గురించి ఆలోచించాల్సిన బాదరబందీ ఉండదని సంస్థ ఎండీ మధు నాయర్‌ తెలిపారు. స్వల్పకాలికం నుంచి దీర్ఘకాలికం వరకు వివిధ కాలావధుల వ్యూహాలతో, ఈక్విటీ ఫండ్‌లకు వర్తించే పన్ను ప్రయోజనాలను అందించేలా ఈ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ ఉంటుందని వివరించారు.  

ఎడెల్‌వీజ్‌... మల్టీ అసెట్‌ ఓమ్ని ఎఫ్‌వోఎఫ్‌ 
ఎడెల్‌వీజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తాజాగా ‘ఎడెల్‌వీజ్‌ మల్టీ అసెట్‌ ఓమ్ని ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌’ (ఎఫ్‌వోఎఫ్‌) పేరుతో కొత్త పథకాన్ని ఇన్వెస్టర్ల కోసం తీసుకొచ్చింది. ఈ పథకం ఈక్విటీతోపాటు బంగారం, వెండి, డెట్‌ సాధనాల్లో పెట్టుబడులు పెడుతుంది. లంప్‌సమ్‌ లేదా సిప్‌ రూపంలో అయినా కనీసం రూ.100 నుంచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. 65% పెట్టుబడులను దేశీ ఈక్విటీలకు కేటాయిస్తుంది.  

పసిడి ఈటీఎఫ్‌లకు 10%, వెండి ఈటీఎఫ్‌లకు 10%, ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాలకు 15% చొప్పున కేటాయిస్తుంది. పెట్టుబడులను వైవిధ్యం చేసి, దీర్ఘకాలంలో స్థిరమైన రాబడిని అందించడం ఈ పథకం ఉద్దేశం. ఈ నెల 23న ఎన్‌ఎఫ్‌వో ముగుస్తుంది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌ కావడంతో తిరిగి సెప్టెంబర్‌ 11 నుంచి పెట్టుబడులకు అందుబాటులోకి వస్తుంది. పెట్టుబడులను 90 రోజుల్లోపు ఉపసంహరించుకుంటే 1% ఎగ్జిట్‌ లోడ్‌ పడుతుంది.    

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)