Breaking News

ఫన్‌ అండ్‌ ఫవర్‌ఫుల్‌ టీవీ!

Published on Sun, 10/19/2025 - 10:41

ఇంట్లో కుటుంబం మొత్తానికి ఆనంద కేంద్రం టీవీ. కాని, దాని వలన ఎక్కువసార్లు సంతోషం కంటే సమస్యలే ఎదురవుతాయి. ఇప్పుడు ఈ చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం ఇచ్చే అద్భుతమైన గాడ్జెట్లు ఇవీ!

కామ్‌గా చూడొచ్చు!
రాత్రి హాయిగా పిల్లలు పడుకొని ఉంటే, అప్పుడే పేరెంట్స్‌ ‘ఇప్పుడు మనం ప్రశాంతంగా సినిమా చూడొచ్చు’ అనుకుంటారు. కాని, టీవీలో వచ్చే ఒక్క మాస్‌ సీన్ సౌండ్‌తో మొత్తం ఇంటి సీనే రివర్స్‌ అవుతుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా, బ్లూటూత్‌ అడాప్టర్‌తో టీవీని హెడ్‌సెట్‌ సాయంతో చూడవచ్చు. దీనిని టీవీకి జత చేస్తే, ఇక మీరు ఏ హెడ్‌సెట్‌నైనా కనెక్ట్‌ చేసుకునే వీలుంటుంది. ఒకేసారి నాలుగు హెడ్‌సెట్లను కూడా కనెక్ట్‌ చేసుకోవచ్చు. అలా మీరు సీరియస్‌గా సీరియల్‌ లేదా సినిమా చూస్తున్నప్పుడు పక్కన వాళ్లని ‘షుష్‌..’ అని చెప్పాల్సిన అవసరం లేదు. బటన్లతో వాల్యూమ్‌ను తక్కువ లేదా ఎక్కువ చేయడం సులభం. ధర రూ. 1,799 మాత్రమే!

అన్ని పరికరాకలకూ ఒక్కటే రిమోట్‌
సోఫాలో హాయిగా కూర్చుని, పక్కన స్నాక్స్‌ పెట్టుకుని, ఫ్యామిలీతో సినిమా చూడటానికి సిద్ధమయ్యే క్షణంలో ‘రిమోట్‌ ఎక్కడ?’ అనే ప్రశ్న! ఆ తర్వాత ఏసీ ఆన్ అవ్వకపోయినా, సెటప్‌బాక్స్‌ సిగ్నల్‌ రాకపోయినా, సేమ్‌ ప్రశ్నే రిపీట్‌! ఇలా పలు రకాల రిమోట్ల కోసం అవసరం లేకుండా చేస్తుంది. ‘సోఫా బటన్‌ ఎక్స్‌వన్‌ యూనివర్సల్‌ రిమోట్‌’. ఇది ఒక్కటి ఉంటే చాలు, అన్ని పరికరాల రిమోట్లకు గుడ్‌బై చెప్పేయొచ్చు. టీవీ, ఏసీ, సెటప్‌ బాక్స్, లైట్స్‌ అన్నీ ఒక్క బటన్తోనే నియంత్రించవచ్చు. వాయిస్‌ కంట్రోల్‌తో కూడా ఆపరేట్‌ చేయవచ్చు. అంటే చేతులు బిజీగా ఉన్నపుడు ‘రిమోట్, టీవీ ఆన్ చేయి’ అని చెప్తే చాలు, వెంటనే చేసేస్తుంది. ఇన్ఫ్రారెడ్‌ కనెక్టివిటీతో అతి తక్కువ సమయంలో సులభంగా అమర్చుకోవచ్చు. ఒకేసారి ఐదు లక్షల పరికరాల వరకు కనెక్ట్‌ చేసుకునే వీలుంది. ధర రూ. 3,999 మాత్రమే!

ఎక్కడినుంచైనా చూడొచ్చు!
ఇక టీవీ చూడటానికి మెడ తిప్పే రోజులు పోయాయి! వంటగదిలో ఉన్నా, హాల్లో ఉన్నా, టీవీనే మీ వైపు తిరిగి ‘కనిపిస్తునున్నానా, ఇంకొంచెం జరగాలా?’ అంటుంది. ఇదే ‘రోబోస్టు టీవీ వాల్‌ మౌంట్‌ బ్రాకెట్‌’ మ్యాజిక్‌. గోడపై తిప్పుతూ, వంచుతూ, టీవీని మీ చూపు కోణానికి సరిపడేలా సర్దేస్తుంది. ఇక వంట చేసేటప్పుడు సీరియల్‌ మిస్‌ కానివ్వదు, క్రికెట్‌ స్కోర్‌ కూడా బాల్కనీలో కాఫీతో కలిపి చూడొచ్చు. చిన్న నుంచి పెద్ద వరకు ఏ టీవీ అయినా, ఇది తన భుజాల మీద సేఫ్‌గా మోస్తుంది. మెటల్‌ బాడీ, తుప్పు, ధూళి భయం లేదు. ఇన్స్టాలేషన్ కూడా చాలా సులభం. ధర కేవలం రూ. 568 మాత్రమే!

#

Tags : 1

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)