బ్రిటన్‌ ఎఫ్‌టీఏతో వస్త్ర పరిశ్రమకు బూస్ట్‌.. 

Published on Thu, 05/08/2025 - 05:23

న్యూఢిల్లీ: బ్రిటన్‌తో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో (ఎఫ్‌టీఏ) కారి్మక శక్తి ఎక్కువగా ఉండే వ్రస్తాలు, లెదర్‌ తదితర దేశీ పరిశ్రమలకు తోడ్పాటు లభిస్తుందని ఎగుమతిదారులు ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిటీష్‌ మార్కెట్లో బంగ్లాదేశ్, వియత్నాంలాంటి దేశాలతో మనం కూడా పోటీపడేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.

 ఈ ఎఫ్‌టీఏతో చాలా మటుకు భారతీయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు గణనీయంగా తగ్గడమో లేదా పూర్తిగా తొలగించడమో జరుగుతుంది కాబట్టి మనకు ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. నియంత్రణ ప్రక్రియలను క్రమబదీ్ధకరించడంతో బ్రిటన్‌లో జనరిక్‌ ఔషధాలకు అనుమతులు వేగవంతం కాగలవని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్‌ ఎస్‌సీ రాల్హన్‌ తెలిపారు. 

చేనేతకారులు, తయారీదారులు, ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు లభిస్తాయని, వాణిజ్య అవరోధాలు తొలగిపోతాయని, ప్రీమియం మార్కెట్‌ అందుబాటులోకి వస్తుందని అపారెల్‌ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) వైస్‌ చైర్మన్‌ ఎ. శక్తివేల్‌ వివరించారు. అంతర్జాతీయ వ్యవస్థకు భారత్‌ను మరింతగా అనుసంధానం చేసేందుకు, విశ్వసనీయ తయారీ భాగస్వామిగా అంతర్జాతీయంగా భారత్‌ స్థానాన్ని పటిష్టం చేసేందుకు ఇలాంటి ఒప్పందాలు కీలకమని రేమండ్‌ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ సింఘానియా తెలిపారు.
 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)