Breaking News

ఫ్రెష్‌వర్క్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీ సీపీవో రాజీనామా

Published on Thu, 08/15/2024 - 17:17

నాస్‌డాక్-లిస్టెడ్ సాఫ్ట్‌వేర్ సంస్థ ఫ్రెష్‌వర్క్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ (CPO) ప్రకాష్ శ్రీనివాసగోపాలన్ రామమూర్తి రాజీనామా చేశారు. ఆగస్టు 14నాటి ఎస్‌ఈసీ ఫైలింగ్‌ సమాచారం ప్రకారం.. కొత్తగా నియమితులైన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డెన్నిస్ వుడ్‌సైడ్‌కి అక్టోబర్ 1 వరకు రామమూర్తి సహకారంగా ఉంటూ సాఫీగా పరివర్తన జరిగేలా చూస్తారు.

మరోవైపు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ టైలర్ స్లోట్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా అదనపు పాత్రను పోషిస్తారని ఆగస్టు 6న ఎస్‌ఈసీ ఫైలింగ్‌లో సంస్థ ప్రకటించింది. అలాగే ఫిలిప్పా లారెన్స్‌ను చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్‌గా కంపెనీ నియమించింది. గత ఆరు నుంచి ఎనిమిది నెలలుగా సంస్థలో మేనేజ్‌మెంట్‌ స్థాయిలో అనేక మార్పులు జరుగుతూ వస్తున్నాయి.

సంస్థ అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న గిరీష్ మాతృభూతం కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ అయ్యారు. డెన్నిస్ వుడ్‌సైడ్ సీఈవో అయ్యారు. ఇది జరిగిన నాలుగు నెలల తర్వాత సీపీవో రాజీనామా వ్యవహారం చోటు చేసుకుంది. ఫ్రెష్‌వర్క్స్ చీఫ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ (CRO) ప్రదీప్ రథినం కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో సంస్థకు రాజీనామా చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)