Breaking News

రెనో చేతికి నిస్సాన్‌ వాటా

Published on Tue, 04/01/2025 - 08:45

న్యూఢిల్లీ: దేశంలోని జపనీస్‌ కంపెనీ నిస్సాన్‌ వాటాను ఫ్రెంచ్‌ ఆటో రంగ దిగ్గజం రెనో కొనుగోలు చేయనుంది. దాంతో దేశీ భాగస్వామ్య కంపెనీ(జేవీ) రెనో నిస్సాన్‌ ఆటోమోటివ్‌ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎన్‌ఏఐపీఎల్‌)ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ జేవీలో నిస్సాన్‌కుగల 51 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు రెనో తాజాగా పేర్కొంది. తద్వారా జేవీలో 100 శాతం వాటా పొందనున్నట్లు, కొనుగోలు ఒప్పందం(ఎస్‌పీఏ) కుదిరినట్లు తెలియజేసింది. అయితే వాటా విలువను వెల్లడించలేదు. ఈ లావాదేవీ తదుపరి రెనో నిస్సాన్‌ జేవీలో రెనో గ్రూప్‌ వాటా 100 శాతానికి చేరనుంది. చెన్నైలోగల ప్లాంటు ద్వారా రెనో, నిస్సాన్‌ బ్రాండ్ల వాహనాలను జేవీ రూపొందిస్తోంది. ఈ ప్లాంటు 6,300 ఉద్యోగులతో వార్షికంగా 4.8 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం సీఎంఎఫ్‌ఏ, సీఎంఎఫ్‌ఏ ప్లస్‌ ప్లాట్‌ఫామ్‌లపై కైగర్, ట్రైబర్, క్విడ్‌ వాహనాలను తయారు చేస్తున్నట్లు రెనో గ్రూప్‌ సీఎఫ్‌వో డంకన్‌ మింటో పేర్కొన్నారు.


ఐటీసీ గూటికి సెంచరీ పల్ప్‌

డీల్‌ విలువ రూ.3,498 కోట్లు

న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా రియల్‌ ఎస్టేట్‌ (ఏబీఆర్‌ఈఎల్‌)లో భాగమైన సెంచరీ పల్ప్‌ అండ్‌ పేపర్‌ను డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఐటీసీ తాజాగా కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ రూ. 3,498 కోట్లు. దీనితో కీలకమైన రియల్‌ ఎస్టేట్‌ విభాగంపై మరింతగా దృష్టి పెట్టేందుకు వెసులుబాటు లభిస్తుందని ఏబీఆర్‌ఈఎల్‌ ఎండీ ఆర్‌కే దాల్మియా తెలిపారు. అలాగే ఏబీఆర్‌ఈఎల్‌ వాటాదార్లకు అధిక విలువ చేకూర్చేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: నేటి నుంచి అమల్లోకి కొత్త ఆర్థిక మార్పులు

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)