Breaking News

ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌

Published on Wed, 08/02/2023 - 04:26

న్యూఢిల్లీ: ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నిలిపివేసిన ఆరు మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలకు సంబంధించి ఇన్వెస్టర్లకు రూ.27,000 కోట్లను చెల్లించింది. 2020 ఆరంభంలో కరోనా వైరస్‌ రాకతో మార్కెట్లలో తీవ్ర అస్థిరతలు పెరిగిపోవడం తెలిసిందే. దీంతో 2020 ఏప్రిల్‌ 23న ఆరు డెట్‌ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను నిలిపివేస్తూ ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకుంది.

ఇన్వెస్టర్ల నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొనగా, అదే సమయంలో మార్కెట్లో డెట్‌ సెక్యూరిటీల అమ్మకాలకు కావాల్సినంత లిక్విడిటీ (కొనుగోలుదారులు) లేనట్టు అప్పుడు సంస్థ ప్రకటించింది. ఆరు పథకాలను నిలిపివేసే నాటికి వాటి పరిధిలోని పెట్టుబడుల విలువ రూ.25,125 కోట్ల మేర ఉండగా, దీంతో పోలిస్తే తాము ఇన్వెస్టర్లకు 107 శాతం మేర చెల్లించినట్టు ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తాజాగా తెలిపింది.

ఫ్రాంక్లిన్‌ ఇండియా లో డ్యురేషన్‌ ఫండ్, ఫ్రాంక్లిన్‌ ఇండియా క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్, ఫ్రాంక్లిన్‌ ఇండియా షార్ట్‌ టర్మ్‌ ఇన్‌కమ్‌ ప్లాన్, ఫ్రాంక్లిన్‌ ఇండియా అల్ట్రా షార్ట్‌ బాండ్‌ ఫండ్, ఫ్రాంక్లిన్‌ ఇండియా ఇన్‌కమ్‌ అపార్చునిటీస్‌ ఫండ్, ఫ్రాంక్లిన్‌ ఇండియా డైనమిక్‌ అక్రూయల్‌ ఫండ్‌ నిలిపివేసిన వాటిల్లో ఉన్నాయి. మరోవైపు ఫ్రాంక్లిన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తన ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్, ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ వ్యాపారాలకు కొత్త నియామకాలను ప్రకటించింది. రాహుల్‌ గోస్వామి ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ ఇండియా ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ విభాగానికి చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్, ఎండీగా వ్యవహరించనున్నారు. ఇప్పటి వరకు చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌గా ఉన్న సంతోష్‌ కామత్‌ ఇకపై ఫ్రాంక్లిన్‌ ఇండియా ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఇండియాకి ప్రెసిడెంట్, చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌గా పనిచేయనున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)