Breaking News

కిరాణా దుకాణాలకు టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌

Published on Wed, 12/25/2024 - 10:14

క్విక్‌ కామర్స్‌(quick commerce) సంస్థల మాదిరిగానే కిరాణా దుకాణాలకు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ అందుబాటులోకి తీసుకురావాలని ది ఫెడరేషన్‌ ఆఫ్‌ రిటెయిలర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (FRAI) ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటికే క్విక్‌ కామర్స్‌ సంస్థల ద్వారా వస్తున్న పోటీని తట్టుకోలేక కిరాణా దుకాణాలు కుదేలవుతున్నాయని చెప్పింది. వీటికితోడు రిటైల్‌(Retail) అవుట్‌లెట్లు పెరుగుతున్నాయని పేర్కొంది. కొత్త కంపెనీలు రిటైల్‌ స్టోర్‌ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాయని, ఇప్పటికే ఆన్‌లైన్‌ షాపింగ్‌ సర్వీసులు అందిస్తున్న కంపెనీలు క్విక్‌కామర్స్‌ సేవలు ప్రారంభిస్తున్నాయని వివరించింది.

ఈ నేపథ్యంలో కిరాణాదారులకు భారీగా నష్టం వాటిల్లుతుందని ఎఫ్‌ఆర్‌ఏఐ తెలిపింది. క్విక్‌ కామర్స్‌ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు సంప్రదాయ కిరాణా దుకాణాలకు ప్రత్యేక ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రభుత్వం కల్పించాలని చెప్పింది. ఇప్పటికే మార్కెట్‌లో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో(Zepto) వంటి క్విక్‌ కామర్స్‌ సంస్థల నుంచి పోటీ పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం కిరాణా దుకాణాలకు తోడ్పాటు అందించాలని తెలిపింది.

ఇదీ చదవండి: ఎకానమీపై ఆర్‌బీఐ బులెటిన్‌

ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్‌ఏఐ గౌరవ అధికార ప్రతినిధి అభయ్‌ రాజ్‌ మిశ్రా మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ONDC) వంటి కొత్త టెక్నాలజీలు, కిరాణా దుకాణాలకు క్విక్‌ కామర్స్‌ పోటీను తట్టుకునేలా పరిష్కారం అందిస్తాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎఫ్‌ఆర్‌ఏఐలో 42 రిటైల్‌ సంఘాలు ఉన్నాయి. 80 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి రిటైలర్లకు ఈ అసోసియేషన్‌ ప్రాతినిధ్యం వహిస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)