Breaking News

మళ్లీ డబ్బు పెడుతున్న ఎఫ్‌పీఐలు

Published on Tue, 12/17/2024 - 09:42

యూఎస్​ ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంకు కీలక వడ్డీరేట్లను మరింత తగ్గించనుందనే అంచనాలతో భారత ఈక్విటీ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను పెంచుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో భారీగా అమ్మకాలు చేసిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) రెండు వారాలుగా తిరిగి ఇండియన్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ను పెంచుతున్నారని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

డిసెంబరు మొదటి రెండు వారాల్లో  ఎఫ్‌పీఐలు నికరంగా రూ.22,766 కోట్లను భారతీయ ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేశారు. నవంబర్‌‌లో వీరు రూ.21,612 కోట్లు, అక్టోబర్‌‌లో భారీగా రూ.94,017 కోట్లను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు సెప్టెంబరులో ఎఫ్‌‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్‌ తొమ్మిది నెలల గరిష్టానికి చేరడం విశేషం. ఆ నెలలో నికర పెట్టుబడి రూ.57,724 కోట్లుగా ఉంది.

ఇదీ చదవండి: క్లెయిమ్‌ చేసుకోని నిధులు రూ.880 కోట్లు

ఎఫ్‌పీఐలు పెరగడానికిగల కారణాలు..

  • అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోతపై అంచనాలు: ఇప్పటికే ఫెడ్‌ వడ్డీరేట్లను దాదాపు 50 బేసిస్‌ పాయింట్లకు తగ్గించింది. డిసెంబర్‌ 19న విడుదలయ్యే ఫెడ్‌ సమావేశంలో మరో 25 బేసిస్‌ పాయింట్లను తగ్గించనున్నట్లు అంచనా వేస్తున్నారు. దాంతో ఇతర ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే భారత మార్కెట్లను మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

  • మార్కెట్ సెంటిమెంట్: సానుకూల రాజకీయ పరిణామాలు, కార్పొరేట్ ఆదాయాల్లో రికవరీ, ప్రైమరీ, సెకండరీ మార్కెట్లలో పెరిగిన పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచాయి.

  • సీఆర్ఆర్ తగ్గింపు: క్యాష్‌ రిజర్వ్‌ రేషియో(సీఆర్‌ఆర్‌) తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం వల్ల మార్కెట్‌లో లిక్విడిటీ, సెంటిమెంట్‌ మెరుగుపడనుంది.

  • ద్రవ్యోల్బణం తగ్గుదల: భారత వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 6.21 శాతం నుంచి నవంబర్‌లో 5.48 శాతానికి తగ్గింది. ఇది ఆర్‌బీఐ ద్రవ్య విధాన సడలింపుపై ఆశలను పెంచింది.

  • చైనా మార్కెట్లలో అనిశ్చితి: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చైనా వస్తువులపై ప్రతిపాదిత సుంకాల పెంపు అంచనాలు భారతీయ ఈక్విటీలకు పాజిటివ్‌గా నిలుస్తున్నాయి.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)