Breaking News

అనిల్ అగర్వాల్‌కు మరో దెబ్బ? టాటా గ్రూపుతో ఫాక్స్‌కాన్‌ చర్చలు?

Published on Tue, 07/11/2023 - 18:10

తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్  రూ.1.6 లక్షల కోట్ల(19.5 బిలియన్ల డాలర్ల) ప్రాజెక్టును వెనక్కి తీసుకుని చైర్మన్ అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని  వేదాంత గ్రూపునకు భారీ షాక్‌ ఇచ్చింది. భారతదేశంలో సెమీకండక్టర్ ఉత్పత్తి కోసం జాయింట్ వెంచర్ (జేవీ) నుండి వైదొలగాలని సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించిన సంస్థ  దేశీయంగా మరో టాప్‌ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

టాటా గ్రూప్‌తో సంభావ్య టై-అప్‌ కోసం ఫాక్స్‌కాన్ అన్వేషిస్తోందని సీఎన్‌బీసీ ఆవాజ్‌ రిపోర్ట్‌ చేసింది. ముఖ్యంగా, టాటా గ్రూప్ ఇటీవలి  సెమీకండక్టర్ ప్రయత్నాలలో ఉంది. మరోవైపు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రాజెక్టుకు ఫాక్స్‌కాన్  కట్టుబడి ఉందనీ,  దేశం ఒక బలమైన సెమీకండక్టర్ తయారీ పర్యావరణ వ్యవస్థను విజయవంతంగా స్థాపించాలని చూస్తోందని ఫాక్స్‌కాన్‌ మంగళవారం మరోసారి స్పష్టం చేసింది. సరైన భాగస్వాముల కోసం సమీక్షిస్తున్నామని, దేశీయ, అంతర్జాతీయ వాటాదారులను స్వాగతించడానికి సిద్ధంగా ఉందని కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించి అప్లికేషన్‌ను సమర్పించే దిశగా పని చేస్తోందని ప్రకటించడం ఈ వార్తలు ఊతమిస్తోంది.  (వేదాంత చిప్‌ ప్లాంటుకు బ్రేక్‌ )

తరువాతి తరం వృద్ధిని ప్రారంభించే క్రమంలో దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన  ఈ మెగా ప్రాజెక్టును కోసం వేదాంత ప్రయత్నించింది.  ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రాయితీలను అందిపుచ్చుకునేందుకు ఫాక్స్ కాన్-వేదాంత జాయింట్‌ వెంచర్‌గా  గుజరాత్ లో సెమీ కండక్టర్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని  భావించాయి. అయితే పరస్పర అంగీకారంతో ఈ డీల్‌ నుంచి తప్పుకుంటున్నట్టు ఫాక్స్‌కాన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. (90 శాతం ఉద్యోగాలు ఫట్‌: సిగ్గూ, శరం, మానవత్వం లేదా? సీఈవోపై పైర్‌)

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)