Breaking News

భారత్‌లో ఐప్యాడ్‌ తయారీ..?

Published on Fri, 07/26/2024 - 14:59

భారత్‌లో యాపిల్‌ ఉత్పత్తులను తయారుచేస్తున్న ఫాక్స్‌కాన్ తన కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తోంది. ప్రస్తుతం తమిళనాడు యూనిట్‌లో యాపిల్‌ ఐఫోన్‌లను తయారుచేస్తున్న కంపెనీ త్వరలో ఐప్యాడ్‌లను కూడా అసెంబుల్‌ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ మేరకు త్వరలో కంపెనీ నుంచి ప్రకటన విడుదల కావొచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు.

యాపిల్‌ భారత్‌లో మరిన్ని ఉత్పత్తులను తయారుచేసేందుకు ఆసక్తిగా ఉందని గతంలోనే ప్రకటించింది. ఇప్పటికే ముంబయి, దిల్లీలో ప్రత్యేకంగా యాపిల్‌ అవుట్‌లెట్లను ప్రారంభించింది. తమిళనాడులో ఫాక్స్‌కాన్‌ ద్వారా ఐఫోన్‌లను తయారు చేస్తోంది. ఆ యూనిట్‌లోని పరికరాల్లో కొన్నింటిని అప్‌గ్రేడ్‌ చేసి ఐప్యాడ్‌లను తయారు చేయవచ్చని నిపుణులు సూచించినట్లు తెలిసింది. అందుకు సంస్థ కూడా ఆమోదం తెలిపిందని కొందరు అధికారులు చెప్పారు. త్వరలో దీనిపై కంపెనీ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. యాపిల్‌ ఉత్పత్తుల తయారీకి సంబంధించి పూర్తిగా చైనాపైనే ఆధారపడకుండా విభిన్న ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా ఐప్యాడ్ తయారీలో కొంత భాగాన్ని గత సంవత్సరం వియత్నాంకు మళ్లించారు.

తమిళనాడులో కొత్త యూనిట్‌ కోసం భారత్‌కు చెందిన ఓ సంస్థ రూ.1,200 కోట్లు వెచ్చిస్తున్నట్లు ఫాక్స​్‌కాన్‌ ఫిబ్రవరిలో ప్రకటించింది. బడ్జెట్‌ 2024-25లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీను 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు. దాంతో దేశీయ తయారీకి ప్రోత్సహం లభించనుంది. యాపిల్‌ సంస్థ ఫాక్స్‌కాన్‌ ద్వారా భారత్‌లో ఐప్యాడ్‌ల ఉత్పత్తి ప్రారంభిస్తే స్థానికంగా మరింత మంది ఉపాధి పొందుతారని నిపుణులు చెబుతున్నారు. దాంతోపాటు అంతర్జాతీయంగా భారత్‌లో తయారైన ఉత్పత్తులను ఎగుమతి చేసి సొమ్ము చేసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్‌ఐ) వల్ల కూడా దేశీయ తయారీని పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు.

ఇదీ చదవండి: భారమవుతున్న విద్యారుణాలు!

ట్రెండ్‌ఫోర్స్‌ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ బోయ్స్ ఫ్యాన్ మాట్లాడుతూ..‘భారత​్‌లో ఐప్యాడ్ ఉత్పత్తిని చేపట్టడం వల్ల సప్లై-చైన్‌ డిమాండ్‌ను భర్తీ చేయవచ్చు. దేశీయంగా యాపిల్‌ ఉత్పతులకు మార్కెట్‌ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఐప్యాడ్ ఎగుమతులు 49 మిలియన్ల(4.9 కోట్లు)కు చేరుకుంటాయని అంచనా’ అని తెలిపారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)