Breaking News

‘నెల జీతాల ఉద్యోగాలు ఉండవ్‌..’

Published on Mon, 11/03/2025 - 14:06

దేశంలో నెల జీతాల ఉద్యోగాలు ఉండబోవంటూ ఓ ఆర్థిక నిపుణుడు చేసిన హెచ్చరిక కలవరపెడుతోంది. భారతదేశ వైట్ కాలర్ జాబ్ యంత్రం ఆగిపోయే దశకు వచ్చిందని మార్సెల్లస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ సౌరభ్ ముఖర్జియా హెచ్చరిస్తున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే “భారతదేశంలో స్థిరమైన జీతం పొందే ఉపాధి యుగం ముగుస్తోంది”

ఇటీవలి పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ముఖర్జియా.. “ఉపాధి వృద్ధి ప్రధానంగా ఆగిపోయింది. ఈ పరిస్థితి కనిపించడమే కాదు.. కోలుకోలేనిదిగా ఉంది” అన్నారు. గత ఐదేళ్లలో వైట్ కాలర్ ఉద్యోగాల పెరుగుదల తక్కువగా ఉండటమే కాక, భవిష్యత్తులో కూడా వాటి పునరుజ్జీవనం “దాదాపు అసంభవం” అని ఆయన అభిప్రాయపడ్డారు.

కారణం ఆటోమేషన్..

ఈ పరిణామానికి ప్రధాన కారణాలు ఆటోమేషన్, కార్పొరేట్ సామర్థ్యం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఏషియన్ పెయింట్స్ వంటి పెద్ద కంపెనీలు, ఇప్పుడు ఉద్యోగులను పెంచుకోకుండానే తమ వ్యాపారాన్ని విస్తరించగలుగుతున్నాయి. “ఈ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు సృష్టించే అవకాశం చాలా తక్కువ. ఆటోమేషన్ వల్ల ఉద్యోగుల సంఖ్యను పెంచకుండానే ఎదగడం సాధ్యమవుతోంది” అని సౌరభ్ ముఖర్జియా అన్నారు

గ్రాడ్యుయేట్ల వెల్లువ.. అవకాశాల కొరత

ప్రతి సంవత్సరం సుమారు 80 లక్షల మంది కొత్త గ్రాడ్యుయేట్లు భారత శ్రామికశక్తిలోకి ప్రవేశిస్తున్నారు. కానీ వీరికి తగిన అవకాశాలు ఉండటం లేదు. “అధికారిక కార్పొరేట్ నిర్మాణం లేకుండా ఈ కొత్త తరం యువతకు జీవనోపాధి కల్పించడం ఎలా అన్నదే దేశం ఎదుర్కొనే సవాలు” అని ఆయన చెప్పారు. రానున్న సంవత్సరాల్లో దేశంలో పని విధానం పూర్తిగా మారిపోతుందని సౌరభ్ ముఖర్జియా హెచ్చరించారు.

గిగ్ ఎకానమీ వైపు ప్రయాణం

సాంప్రదాయ వేతన ఉద్యోగాలు వేగంగా తగ్గిపోతాయనేది సౌరభ్ ముఖర్జియా అంచనా. “డ్రైవర్లు, కోడర్లు, పాడ్‌కాస్టర్లు, ఫైనాన్షియల్ అడ్వైజర్లు అందరూ స్వయం ఉపాధి వైపు వెళ్తున్నారు,” అని ఆయన చెప్పారు. “మనం గిగ్ ఉద్యోగాల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం. జీతం ఆధారిత ఉపాధి యుగం చరిత్రలో కలిసిపోతోంది” అన్నారు.

గిగ్‌ ఎకానమీ భారత్‌కు కలిసివస్తుందని ముఖర్జియా ఆశాజనకంగా కూడా ఉన్నారు. 29 సంవత్సరాల సగటు వయస్సు ఉన్న యువ జనాభా, ప్రపంచంలోనే చౌకైన మొబైల్ బ్రాడ్‌బ్యాండ్, అలాగే ఆధార్, యూపీఐ వంటి డిజిటల్ వ్యవస్థలు.. ఇవన్నీ భారత్‌ను “గిగ్ ఎకానమీ” యుగంలో బలంగా నిలబెడతాయని ఆయన నమ్మకం.

“సాంప్రదాయ వైట్ కాలర్ ఉద్యోగాలు సవాలుగా మారతాయి. మన జీవితంలో ఎక్కువ భాగం గిగ్ కార్మికులుగా గడపాల్సిన భవిష్యత్తు కోసం మనమూ, మన పిల్లలూ సిద్ధం కావాలి” అని ఆయన స్పష్టం చేశారు.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)