Breaking News

గ్రామీణ మార్కెట్లలో ఎఫ్‌ఎంసీజీ అమ్మకాల జోరు..

Published on Sat, 08/16/2025 - 05:53

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ అమ్మకాలు పట్టణాల కంటే గ్రామీణ మార్కెట్లలో మెరుగ్గా ఉన్నట్టు డేటా విశ్లేషణ సంస్థ నీల్సన్‌ఐక్యూ వెల్లడించింది. జూన్‌ త్రైమాసికంలో పట్టణ ప్రాంతాల్లో ఎఫ్‌ఎంసీజీ అమ్మకాలు 4.6 శాతం పెరగ్గా.. దీనికి రెట్టింపు స్థాయిలో 8.4 శాతం మేర గ్రామీణ మార్కెట్లలో వృద్ధి నమోదైనట్టు తన తాజా నివేదికలో తెలిపింది. వరుసగా ఆరో త్రైమాసికంలో అమ్మకాల వృద్ధి (పరిణామం పరంగా) పట్టణాల కంటే గ్రామీణ మార్కెట్లలో అధికంగా ఉన్నట్టు పేర్కొంది. 

ఈ ఏడాది మార్చి త్రైమాసికంతో పోల్చి చూస్తే మాత్రం జూన్‌ క్వార్టర్‌లో గ్రామీణ – పట్టణ ప్రాంతాల మధ్య వృద్ధి పరమైన అంతరం తగ్గినట్టు వెల్లడించింది. మొత్తం మీద జూన్‌ త్రైమాసికంలో ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ అమ్మకాల్లో (విలువ పరంగా) 13.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. పట్టణాల్లో స్థిరమైన వినియోగానికి తోడు, గ్రామీణ ప్రాంతాల్లో పుంజుకున్న వినియోగం ఇందుకు మద్దతుగా నిలిచాయి. అమ్మకాల్లో 6%, ధరల పెంపు రూపంలో 7.4% చొప్పున వృద్ధిని సాధించినట్టు, చిన్న ప్యాకెట్లకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నట్టు నీల్సన్‌ఐక్యూ నివేదిక తెలిపింది. చిన్న పట్టణాల్లో అమ్మకాలు పుంజుకుంటున్నట్టు పేర్కొంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)