Breaking News

ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లో కొత్త సర్వీసులు

Published on Thu, 07/11/2024 - 12:07

భారతీయ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ తన డిజిటల్ చెల్లింపు సర్వీసులను విస్తరించేందుకు బిల్‌డెస్క్‌ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని పేర్కొంది. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌లో ఫాస్టాగ్‌, డీటీహెచ్‌ రీఛార్జ్‌లు, ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ పోస్ట్‌పెయిడ్ బిల్లు చెల్లింపులను అందిస్తున్నట్లు తెలిపింది.

ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ పేమెంట్స్‌ అండ్‌ సూపర్‌కాయిన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ అరోరా మాట్లాడుతూ..‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అభివృద్ధి చేసిన భారత్ బిల్ పేమెంట్స్ సిస్టమ్ (బీబీపీఎస్‌)తో కొత్త సేవలను ఏకీకృతం చేయడానికి బిల్‌డెస్క్‌తో కుదిదిన ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుంది. కంపెనీ అందిస్తున్న ఈ సేవలకు అదనంగా విద్యుత్ బిల్లు చెల్లింపులు, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఫ్లిప్‌కార్ట్‌ యూపీఐ ద్వారా లావాదేవీలు చేసి 10 శాతం వరకు సూపర్‌కాయిన్లను రెడీమ్‌ చేసుకోవచ్చు. కస్టమర్ల కోసం డిజిటల్ చెల్లింపులను సులభతరం చేయడానికి, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది’ అని చెప్పారు.

ఇదీ చదవండి: వచ్చే 2-3 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు!

2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్‌) ద్వారా దేశమంతటా సుమారు 1.3 బిలియన్(130 కోట్లు) లావాదేవీలు జరుగుతాయని సమాచారం. 2026 నాటికి ఈ సంఖ్య 3 బిలియన్ల(300 కోట్లు)కు పైగా ఉంటుందని అంచనా.

#

Tags : 1

Videos

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)