Breaking News

25 వేల రూట్లు, 10 లక్షల బస్సులు.. ఈకామర్స్‌ సంస్థ కొత్త సేవలు

Published on Tue, 04/09/2024 - 14:47

ఆన్‌లైన్‌ ఈకామర్స్‌ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్‌ తన వాటాను పెంచుకున్నప్పటి నుంచి కంపెనీను లాభాలబాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ బస్‌ టికెట్‌ బుకింగ్‌ సేవలను ప్రారంభించారు. 

ఈమేరకు రాష్ట్ర రవాణా కార్పొరేషన్లు, ప్రైవేట్‌ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కంపెనీలు వర్గాలు తెలిపాయి. అయితే  ప్రస్తుతానికి ఈ సేవలు బెంగళూరు, ఛండీగఢ్‌, దిల్లీ, జైపూర్‌, ఇందోర్‌, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. 

ఇదీ చదవండి: లగేజీ తీసుకురావడానికి రూ.25 కోట్ల కాన్వాయ్‌!

ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్‌ బస్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు టికెట్‌ ధరతోపాటు ఇతర ఛార్జీలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. అయితే కొత్తగా వచ్చిన ఫ్లిప్‌కార్ట్‌ బుకింగ్‌ పోర్టల్‌లో టికెట్‌ కొంటే ఎలాంటి ఛార్జీలు ఉండవని చెప్పారు. కొత్తసేవలు ప్రారంభించిన సందర్భంగా ఏప్రిల్‌ 15 వరకు టికెట్‌ ధరలో 20 శాతం వరకు రాయితీని సైతం పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 25 వేలకు పైగా రూట్లలో 10 లక్షలకు పైగా బస్సులను అనుసందానిస్తూ ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)