ఒకేసారి 300 మంది ఉద్యోగులపై వేటు!

Published on Fri, 03/06/2026 - 17:35

అమెజాన్ కంపెనీ ఉద్యోగుల తొలగింపును ప్రకటించిన తరువాత.. మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన వార్షిక పనితీరు సమీక్షలో భాగంగా దాదాపు 300 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం సంస్థ తన వ్యాపారాలలో దాదాపు 20,000 మంది ఉద్యోగులను మాత్రమే కలిగి ఉంది.

2024 ప్రారంభంలో కూడా ఫ్లిప్‌కార్ట్ తన వార్షిక పనితీరు సమీక్షలో 5 శాతం లేదా 1000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మరోమారు 300 మందిని తొలగించినట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు.

ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఇంటర్నెట్ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించడం & పనితీరును మెరుగుపరచడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. స్టార్టప్ రంగంలో పెట్టుబడులు తగ్గడం.. లాభదాయకతపై పెట్టుబడిదారులు ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యలను తీసుకుంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్ కూడా అదే దిశగా చర్యలు తీసుకుంటూ సంస్థ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తోంది.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఫ్లిప్‌కార్ట్ భవిష్యత్తులో స్టాక్ మార్కెట్‌లో ఐపీఓ ద్వారా ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే.. సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్, మోర్గాన్ స్టాన్లీ, జేపీ మోర్గాన్ & కోటక్ మహీంద్రా క్యాపిటల్ వంటి పెట్టుబడి బ్యాంకులతో ప్రారంభ చర్చలు జరుపుతోంది. కాగా కంపెనీ 2026 చివరలో లేదా 2027 ప్రారంభంలో ఐపీఓ చేయాలని లక్ష్యంగా పెట్టుకునే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. ఇటీవల ఫ్లిప్‌కార్ట్ తన సంస్థ నిర్మాణంలో కూడా కొన్ని మార్పులు చేసింది. కంపెనీకి సంబంధించిన హోల్డింగ్ సంస్థను సింగపూర్ నుంచి తిరిగి భారతదేశానికి మార్చడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) నుంచి ఆమోదం పొందింది. ఈ నిర్ణయం కంపెనీ భారతదేశంలో పబ్లిక్ లిస్టింగ్‌కు సిద్ధం కావడంలో ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.

ఇదీ చదవండి: జియో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్: 200 రోజుల కంటే ఎక్కువ వ్యాలిడిటీ!

Videos

రేపు అహ్మదాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్

అల్లు వారి పెళ్లి సందడి..

యుద్ధానికి వారం రోజులు.. ఎంత నష్టం అంటే..

ప్లే స్కూల్ లో చిన్నారిపై యాసిడ్ పోసిన టీచర్..

భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు

ఉద్యోగం లేదు.. ఉపాధి లేదు.. అంతా ఉత్తిదే తమ్ముళ్లు..

ఖమేనీని చంపిన నీలి పిచ్చుక.. దీని ప్రత్యేకత ఇదే

ఏ దేశంలో ఎన్ని అణుబాంబులున్నాయి? మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా

పావలా శ్యామలకు బన్నీ భరోసా..!

UPSC సివిల్స్ ఫలితాలు విడుదల టాపర్స్ వీళ్లే

Photos

+5

హైదరాబాద్‌లో గ్రాండ్‌గా అల్లు శిరీష్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ సుమలత ఫ్యామిలీ ఫొటోలు

+5

జాన్వీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

నయనిక పెళ్లి కూతురి వేడుక.. అల్లు ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ హీరోయిన్లు (ఫొటోలు)

+5

పెళ్లి వేడుకలో విజయ్‌, త్రిష సందడి.. ఫోటోలు వైరల్

+5

నిజామాబాద్‌లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య 'వృషకర్మ' గ్లింప్స్‌ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)

+5

టి20 ప్రపంచకప్‌లో తుది పోరుకు భారత్‌ (ఫొటోలు)

+5

భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుక.. హాజరైన ప్రముఖులు (ఫొటోలు)