Breaking News

ఫ్లిప్‌కార్ట్‌తో ముగిసిన సస్తాసుందర్‌ భాగస్వామ్యం

Published on Wed, 01/29/2025 - 08:20

ఈ–కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ తాజాగా ఆన్‌లైన్‌ ఫార్మసీ, హెల్త్‌కేర్‌(Health care) విభాగంలో తన భాగస్వామ్యాన్ని ముగించిందని ఆన్‌లైన్‌లో ఔషధాలను విక్రయిస్తున్న సస్తాసుందర్‌ తెలిపింది. బ్రాండ్‌ మేధో సంపత్తి హక్కులను (ఐపీఆర్‌) తిరిగి పొందినట్లు వెల్లడించింది. వాల్‌మార్ట్‌ ప్రమోట్‌ చేస్తున్న ఫ్లిప్‌కార్ట్‌ 2021లో సస్తాసుందర్‌ మార్కెట్‌ప్లేస్‌లో 75 శాతం వాటాను రూ.750 కోట్లకు కొనుగోలు చేసింది. కంపెనీ యాప్‌ను ప్రారంభిస్తామని సస్తాసుందర్‌ గ్రూప్‌ చైర్మన్‌ బి.ఎల్‌.మిత్తల్‌ తెలిపారు.

ఇదీ చదవండి: సీమాంతర పెట్టుబడులకు ముంబై టాప్‌

‘హోల్డింగ్‌ కంపెనీ సస్తాసుందర్‌ వెంచర్స్‌ కొత్తగా ఏర్పడిన అనుబంధ సంస్థ సస్తాసుందర్‌ హెల్త్‌టెక్‌ ద్వారా బ్రాండ్‌ ఐపీఆర్‌లు, పోటీ రహిత హక్కులను ఫ్లిప్‌కార్ట్‌ హెల్త్‌ ప్లస్‌ నుండి తిరిగి పొందింది. ఇందుకోసం సుమారు రూ.100 కోట్ల విలువైన కంపల్సరీ కన్వర్టబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్లను ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించాం. చివరి త్రైమాసికంలో లావాదేవీ పూర్తయింది. దీని ఫలితంగా నిలుపుకున్న 25 శాతం వాటాను రైట్‌ ఆఫ్‌ చేయడం వల్ల దాదాపు రూ.188 కోట్ల నష్టం వాటిల్లింది. ఇది కేవలం టెక్నికల్‌ అకౌంటింగ్‌ నష్టం. కంపెనీకి భౌతిక నష్టం కాదు. ఆరోగ్య వ్యాపారం నుండి నిష్క్రమించాలన్న అంతర్జాతీయ ప్రణాళికను అనుసరించి ఫ్లిప్‌కార్ట్‌ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని నేను భావిస్తున్నాను. ఫ్లిప్‌కార్ట్‌ హెల్త్‌ ప్లస్‌ కంపెనీ వారితోనే ఉంటుంది. వారు ఆ కంపెనీని ఏం చేస్తారనేది వారి ఇష్టం’ అని మిత్తల్‌ వివరించారు.

Videos

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)