Breaking News

Flipkart Big End of Season Sale 2024: రేపటి నుంచే ఫ్లిప్‌కార్ట్‌ సీజన్‌సేల్‌.. ఆఫర్లు ఇవే..

Published on Fri, 05/31/2024 - 19:55

ఆన్‌లైన్‌ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్ జూన్ 1 నుంచి ‘బిగ్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సీజన్‌ సేల్‌లో ఫ్యాషన్ కేటగిరీలోని వస్తువులపై ఆకర్షణీయలమైన ఆఫర్లు ఉంటాయని చెప్పింది.

బిగ్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌ 2024లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ 12,000 బ్రాండ్‌లను కస్టమర్లకు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. 2 లక్షలకు పైగా అమ్మకందారుల నుంచి వీటిని ఎంపిక చేశామని చెప్పింది. స్పోర్ట్స్ షూ, గడియారాలు, జీన్స్ వంటి వాటిని ఓపెన్-బాక్స్ డెలివరీ అందిస్తామని పేర్కొంది. ఒక లక్షకు పైగా ఉత్పత్తులను బుక్‌ చేసుకున్న రోజే డెలివరీ ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ సేల్‌లో అన్ని ప్రముఖ బ్రాండ్‌లు అందుబాటులో ఉంటాయని, కంపెనీ ఆఫర్లను అందరూ వినియోగించుకోవాలని కోరింది.

ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో భాగంగా తమ కస్టమర్‌లకు బ్యాంక్ ఆఫర్‌ను అందిస్తుంది. ఆర్‌బీఎల్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ (కనీస ఆర్డర్ విలువ రూ.2,500) క్రెడిట్ కార్డ్‌లపై ఉత్పత్తి ధరలో 10% ఇన్‌స్టాంట్‌ తగ్గింపు ఇస్తున్నారు. కనీసం రూ.200 విలువ చేసే ఉత్పత్తులను యూపీఐ పేమెంట్‌ ద్వారా ఆర్డర్ చేస్తే ఆకర్షణీయమైన ఆఫర్‌లను పొందవచ్చని కంపెనీ చెప్పింది.

ఇదీ చదవండి: అంబానీ మనవరాలా..మజాకా..‍క్రూయిజ్‌లో ఫస్ట్‌ బర్త్‌డే

ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ వైస్ ప్రెసిడెంట్ అండ్‌ హెడ్ అరీఫ్ మొహమ్మద్ మాట్లాడుతూ..‘మార్కెట్‌లో పేరున్న బ్రాండ్‌లను వినియోగదారులకు తక్కువ ధరకే ఇస్తున్నాం. దుస్తులు, పాదరక్షలు, యాక్సెసరీ వంటి విభాగాల్లో మరింత ట్రెండింగ్‌ వస్తువులను అందిస్తున్నాం. కస్టమర్లకు 75 లక్షలకు పైగా విభిన్న ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నాం. ఈ సేల్‌ను ఒక వేడుకగా జరుపుతున్నాం. ఇందులో 10 మిలియన్లకు పైగా కొత్త కస్టమర్లు పాల్గొనే అవకాశం ఉంది. వీరు ఎక్కువగా స్పోర్ట్స్ షూస్, లగేజ్, వాచీలు, ఎత్నిక్ సూట్‌లు, పార్టీ డ్రెస్‌లు వంటి వాటిపై ఆసక్తి చూపుతున్నారు’ అని చెప్పారు.

Videos

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)