Breaking News

వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్‌ ధర.. ఎంతంటే..

Published on Tue, 01/02/2024 - 09:16

విమానాల్లో వాడే జెట్ ఇంధనం/ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్‌ ​(ఏటీఎఫ్‌) ధర 4 శాతం తగ్గించినట్లు కేంద్రం తెలిపింది. వరుసగా మూడో నెలలోనూ దీని ధర తగ్గింది. వాణిజ్య వంట గ్యాస్ (ఎల్పీజీ) రేటు స్వల్పంగా కుదించినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 19 కిలోల సిలిండర్‌‌‌‌ ధరను రూ.1.50 కట్‌ చేశారు. 

వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ రేటు ప్రస్తుతం దేశ రాజధానిలో రూ.1,755.50, ముంబైలో రూ.1,708.50 ఉంది. అయితే, గృహాల్లో వినియోగించే ఎల్పీజీ ధర మాత్రం మారలేదు. 14.2 కిలోల సిలిండర్‌‌‌‌ ధర సుమారు రూ.903 ఉంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్‌ (ఏటీఎఫ్​) ధర 3.9 శాతం తగ్గింపుతో రూ.4,162.5కు చేరింది. జెట్ ఇంధన ధరల్లో నెలవారీ తగ్గింపు ఇది వరుసగా మూడోది. ఏటీఎఫ్​ ధర నవంబర్‌‌‌‌లో దాదాపు 6 శాతం (కిలోలీటరుకు రూ.6,854.25)  డిసెంబర్‌‌‌‌లో రూ.5,189.25 లేదా 4.6 శాతం తగ్గింది.

ఇదీ చదవండి: ప్యాకేజ్డ్‌ ఉత్పత్తుల ముద్రణలో కీలక మార్పులు..

విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో 40 శాతం ఇంధనానికే ఖర్చవుతోంది. ఫ్యూయెల్‌ ధర తగ్గింపుతో  ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయిన విమానయాన సంస్థలపై కొంత భారం తగ్గనుంది.

Videos

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)