Breaking News

చాలా కాలం తర్వాత ఎఫ్‌డీలకు కళ!

Published on Wed, 03/01/2023 - 04:30

ముంబై: చాలా ఏళ్ల విరామం తర్వాత బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రేట్లు ఆకర్షణీయంగా మారుతున్నాయి. వడ్డీ రేట్లు 8 శాతాన్ని దాటాయి. ప్రభుత్వరంగంలోని పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ అత్యధికంగా 8–8.5 శాతం వరకు రేట్లను ఆఫర్‌ చేస్తోంది. ద్రవ్యోల్బణం మించి రాబడిని బ్యాంక్‌లు 200–800 రోజుల డిపాజిట్లపై ఇస్తున్నాయి. ఆర్థిక రంగ కార్యకలాపాలు ఊపందుకోవంతో రుణాలకు డిమాండ్‌ నెలకొంది. రుణ డిమాండ్‌ను అందుకునేందుకు బ్యాంక్‌లు నిధుల కోసం వేట మొదలు పెట్టాయి. ఫలితంగా డిపాజిట్‌ రేట్లను సవరిస్తున్నాయి. జనవరి నెలకు ద్రవ్యోల్బణం 6.52 శాతంగా ఉండడం గమనించాలి.  

రుణాలకు డిమాండ్‌..
జనవరి 13తో ముగిసిన 15 రోజుల్లో బ్యాంకుల రుణ వృద్ధి 16.5 శాతంగా (వార్షికంగా చూస్తే) ఉంది. కానీ, అదే కాలంలో డిపాజిట్లలో వృద్ధి  10.6 శాతంగా ఉంది. ఇక గత ఏడాది కాలంలో డిపాజిట్లలో వృద్ధి 6 శాతం మించి లేదు. ఇటీవల వడ్డీ రేట్లు పెరగడంతో డిపాజిట్లలోనూ వృద్ధి మొదలైందని చెప్పుకోవాలి. ఏడాది కాల పోస్టాఫీసు డిపాజిట్‌పై రేటు 6.6 శాతంగా ఉంటే, రెండేళ్ల కాలానికి 6.8 శాతంగా ఉంది. పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీ ఈల్డ్‌ 7.35 శాతంగా ఉంది. వీటితో ఇప్పుడు బ్యాంక్‌ డిపాజిట్లు పోటీపడుతున్నాయి. ఆర్‌బీఐ గతేడాది మే నుంచి రెపో రేటును 2.5 శాతం మేర పెంచింది. దీంతో బ్యాంకులు సైతం రుణాలపై ఇంతే మేర రేట్లు పెంచాయి. ఫలితంగా డిపాజిట్లపై మరింత రాబడిని ఆఫర్‌ చేయడానికి ముందుకు వస్తున్నాయి. కానీ, రుణాలపై పెంచిన స్థాయిలో రేట్లను డిపాజిట్లపై ఆఫర్‌ చేయకపోవడాన్ని గమనించొచ్చు.

బ్యాంకుల వారీ రేట్లు..  
ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 200–800 రోజుల కాలానికి వడ్డీ రేట్లు 7–7.25శాతం స్థాయిలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 20వేల శాఖలతో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్‌బీఐ 400 రోజుల డిపాజిట్‌పై 7.10 శాతం రేటును ఆఫర్‌ చేస్తోంది. సీనియర్‌ సిటిజన్లకు మరో అర శాతం అదనంగా ఇస్తోంది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 444 రోజుల డిపాజిట్‌పై 7.35 శాతం రేటును ఇస్తోంది. యూనియన్‌ బ్యాంక్‌ 800 రోజుల డిపాజిట్‌పై 7.30 శాతం, పీఎన్‌బీ 666 రోజుల డిపాజిట్‌పై 7.25 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 444 రోజులు డిపాజిట్‌పై ఇంతే మేర ఆఫర్‌ చేస్తున్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 200 రోజుల డిపాజిట్‌పై 7 శాతం ఇస్తుంటే, కెనరా బ్యాంక్‌ 400 రోజుల డిపాజిట్‌పై 7.15 శాతం, యూకో బ్యాంక్‌ 666 రోజుల డిపాజిట్‌పై 7.15 శాతం చొప్పున ఆఫర్‌ చేస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ 7 శాతం చొప్పున ఇస్తున్నాయి.    

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?