Breaking News

5 కంపెనీలు రెడీ

Published on Mon, 10/26/2026 - 01:32

న్యూఢిల్లీ: సెకండరీ మార్కెట్లకు భిన్నమైన రీతిలో ఈ వారం కూడా ప్రైమరీ మార్కెట్లు కొత్త ఇష్యూలతో కళకళలాడనున్నాయి. లిస్టింగ్‌కు వీలుగా ఐదు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూ చేపట్టనున్నాయి. తద్వారా ఉమ్మడిగా ఇవి రూ. 2,600 కోట్లు సమీకరించనున్నాయి. ఈ  జాబితాలో విభిన్న రంగాలకు చెందిన కంపెనీలు చేరాయి. వివరాలు చూద్దాం.. 

ఈఏఏఏ ఇండియా ఆల్టర్నేటివ్స్‌  
ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు చెందిన ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కంపెనీ.. ఈఏఏఏ ఇండియా ఆల్టర్నేటివ్స్‌ ఐపీవో నేడు(26న) ప్రారంభమై 28న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణి రూ. 1,585–1,665కాగా.. ఇష్యూలో భాగంగా ఎడిల్‌వీజ్‌ గ్రూప్‌ షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 1,200 కోట్లు సమీకరించే ప్రళాళికల్లో ఉంది. లిస్టింగ్‌లో కంపెనీ విలువ రూ. 10,765 కోట్లుగా నమోదుకావచ్చు.  

ఎస్‌ఎఫ్‌సీ ఎన్విరాన్‌మెంటల్‌ టెక్నాలజీస్‌  
వృథానీటి శుద్ధి(వేస్ట్‌వాటర్‌ ట్రీట్‌మెంట్‌) సొల్యూషన్లు అందించే ఎస్‌ఎఫ్‌సీ ఎన్విరాన్‌మెంటల్‌ టెక్నాలజీస్‌ ఐపీవో రేపు(27న) ప్రారంభంకానుంది. 29న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 313–330కాగా.. తద్వారా రూ. 668 కోట్లు అందుకోవాలని చూస్తోంది. ఇందుకు రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండటంతోపాటు, మరో 1.57 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు వెచ్చించనుంది. లిస్టింగ్‌లో కంపెనీ విలువ రూ. 3,233 కోట్లుగా నమోదుకావచ్చు.  

బీఎల్‌ఎస్‌ పాలిమర్స్‌ 
ప్రత్యేక పాలిమర్‌ కాంపౌండ్స్‌ తయారుచేసే బీఎల్‌ఎస్‌ పాలిమర్స్‌ ఐపీవో రేపు(27న) ప్రారంభమై 29న ముగియనుంది. ధరల శ్రేణి రూ. 142–150కాగా.. రూ. 255 కోట్లు సమీకరించనుంది. ఇందుకు 1.7 కోట్ల ఈక్విటీ షేర్లు కొత్తగా జారీ చేయనుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 78 కోట్లు ఉత్పత్తి సామర్థ్య విస్తరణకు, రూ. 90 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌కు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. 

ఎంకే సన్స్‌ ఫైన్‌ జ్యువెల్స్‌
బంగారు ఆభరణ రిటైల్‌ కంపెనీ ఎంకే సన్స్‌ ఫైన్‌ జ్యువెల్స్‌ ఐపీవో ఈ నెల 28న ప్రారంభమై 30న ముగియనుంది. ధరల శ్రేణి రూ. 153–162కాగా.. రూ. 275 కోట్లకు పైగా సమకూర్చుకోనుంది. ఇందుకు 1.36 కోట్ల ఈక్విటీ షేర్లు కొత్తగా జారీ చేయడంసహా మరో 34 లక్షల షేర్లు ప్రమోటర్‌ విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధులను కొత్త షోరూముల ఏర్పాటు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. 

బాంబే కోటెడ్‌ అండ్‌ స్పెషల్‌ స్టీల్స్‌
స్టీల్‌ క్వాయిల్స్‌ను విలువజోడింపు ద్వారా స్లిట్, ఎంబోజ్‌డ్‌ క్వాయిల్స్‌ తదితరాలుగా రూపొందించే బాంబే కోటెడ్‌ అండ్‌ స్పెషల్‌ స్టీల్స్‌ ఐపీవో ఈ నెల 29న ప్రారంభమై నవంబర్‌ 2న ముగియనుంది. ధరల శ్రేణి రూ. 78–82కాగా.. రూ. 183 కోట్లకు పైగా సమీకరించనుంది. ఇందుకు అనుగుణంగా కొత్తగా ఈక్విటీ షేర్లు జారీ చేయనుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 125 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 16 కోట్లు క్యాపిటల్‌ ఎక్విప్‌మెంట్‌ కొనుగోలు వ్యయాలకు కేటాయించనుంది. 

ఇంకా పలు కంపెనీలు సై
వచ్చే వారం గుజరాత్‌ విక్టరీ ఫోర్జింగ్‌ మైల్‌స్టోన్‌ గేర్స్, అవాడా ఎలక్ట్రో, స్వర బేబీ ప్రొడక్ట్స్, ఇంటెగ్రిస్‌ మెడ్‌టెక్, ఏజీఎస్‌ హెల్త్‌ తదితర మరిన్ని కంపెనీలు లిస్టింగ్‌ బాటలో సాగనున్నాయి. ఇందుకు అనుగుణంగా ధరల శ్రేణి ప్రకటించడంతోపాటు.. నవంబర్‌ 5 నుంచి ఐపీవో చేపట్టనున్నాయి. ఇప్పటికే దేశీయంగా అతిపెద్ద(రూ. 30,213 కోట్లు) ఇష్యూ పూర్తి చేసుకున్న జియో ప్లాట్‌ఫామ్స్‌ లిస్ట్‌కానుండగా.. ఈ ఏడాది(2026) ఇప్పటివరకూ 104 కంపెనీలు రూ. 1.4 లక్షల కోట్లు సమీకరించడం విశేషం!

Videos

తప్పేముంది.. అవసరమైతే విజయ్ ని మళ్లీ పెళ్లి చేసుకుంటా..

హైకోర్టులో మోహిత్ రెడ్డి పిటిషన్

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శ

పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ యంగ్ హీరోలు.. కాబోయే వధువులు వీరే!

వారణాసే లాస్ట్.. హాలీవుడ్ బాట పట్టనున్న జక్కన్న

ధనుష్ కొత్త పార్టీ గుర్తు ఇదేనా...?

ది హిందూ కథనంపై స్పందించిన నటుడు ప్రకాశ్ రాజ్

బంగారం ధరల్లో ట్విస్ట్! పండక్కి ముందే రివర్స్ గేర్...

రైల్వే ట్రాక్ పై కుప్పకూలిన క్రేన్.. వేగంగా ఢీకొట్టిన రైలు

Photos

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)

+5

ఫ్యామిలీ తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింగర్ మనో (ఫొటోలు)

+5

'డార్క్ చాక్లెట్' మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

విజయనగరం : పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం (ఫొటోలు)

+5

'యాక్షన్ కింగ్' అర్జున్ చిన్న కుమార్తె అంజనా సర్జా వివాహం (ఫొటోలు)

+5

త్రిష రోడ్ షో.. అభిమానుల సందడితో దద్దరిల్లిన రోడ్లు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉత్సాహంగా ‘కే హార్మనీ ఫెస్టా– కొరియా కల్చర్‌ డే– 2026’ (ఫొటోలు)