Breaking News

ప్రభుత్వ బ్యాంకుల పనితీరుకు రేటింగ్‌ ఇలా..

Published on Wed, 03/12/2025 - 11:47

న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజాలు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ)కు తాజాగా ఫిచ్‌ స్థిరత్వ(స్టేబుల్‌) రేటింగ్‌ను ప్రకటించింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టేబుల్‌ ఔట్‌లుక్‌తో బీబీబీ రేటింగ్‌ను పొందాయి. ప్రభుత్వ మద్దతు, సానుకూల నిర్వహణా పరిస్థితులు, రిస్క్‌ ప్రొఫైల్, ఆస్తుల(రుణాలు) నాణ్యత మెరుగుపడుతుండటం, నిధుల సమీకరణ, లిక్విడిటీ వంటి అంశాలు రేటింగ్‌కు ప్రభావం చూపినట్లు ఫిచ్‌ పేర్కొంది.

ఇదీ చదవండి: టెస్లా కారు కొనుగోలు చేసిన ట్రంప్‌!

బ్యాంక్‌ సామర్థ్య సంబంధిత వయబిలిటీ రేటింగ్‌(వీఆర్‌)ను బీ-ప్లస్‌ నుంచి బీబీ-మైనస్‌కు అప్‌గ్రేడ్‌ చేసింది. ప్రభుత్వ మద్దతు రేటింగ్‌(జీఎస్‌ఆర్‌)ను బీబీబీ-మైనస్‌గా ప్రకటించింది. బ్యాంకుల రిస్క్‌ ప్రొఫైల్‌ మెరుగుపడటం.. ప్రధానంగా ఆర్థిక పనితీరులో ఇది ప్రతిబింబించడం వీఆర్‌ అప్‌గ్రేడ్‌కు కారణమైనట్లు రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ తెలియజేసింది. ఈ బాటలో యూనియన్‌ బ్యాంక్, పీఎన్‌బీల దీర్ఘకాలిక జారీ డిఫాల్ట్‌ రేటింగ్‌(ఐడీఆర్‌)కు స్థిరత్వ ఔట్‌లుక్‌తో బీబీబీ-మైనస్‌ ఇచ్చింది. యూనియన్‌ బ్యాంక్‌లో 75 శాతం, పీఎన్‌బీలో 70 శాతం ప్రభుత్వ వాటాతోపాటు.. వ్యవస్థాగత ప్రాధాన్యత ఆధారంగా రేటింగ్‌ను ప్రకటించినట్లు ఫిచ్‌ వివరించింది. రిస్క్‌లను సమర్ధవంతంగా నిర్వహించగలిగితే.. బ్యాంకుల లాభదాయక బిజినెస్‌కు దేశ ఆర్థిక వృద్ధి మద్దతిస్తుందని అభిప్రాయపడింది. యూనియన్‌ బ్యాంక్, పీఎన్‌బీ రుణ నాణ్యత రేటింగ్‌లను స్టేబుల్‌ నుంచి సానుకూలానికి(పాజిటివ్‌) సవరించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)