Breaking News

భారత వృద్ధి 7.4 %

Published on Fri, 12/05/2025 - 03:21

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచాలను పెంచుతున్నట్టు అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ రేటింగ్స్‌ ప్రకటించింది. 2025–26లో 6.9 శాతం వృద్ధి నమోదుకావొచ్చన్న గత అంచనాను 7.4 శాతానికి పెంచింది. ఈ ఏడాది ప్రైవేటు వినియోగం వృద్ధికి ప్రధాన చోదకంగా ఉన్నట్టు వివరించింది. దీనికి తోడు ఇటీవల చేపట్టిన జీఎస్‌టీ సంస్కరణలతో సెంటిమెంట్‌ మెరుగుపడినట్టు తెలిపింది. 

ద్రవ్యోల్బణం గణనీయంగా దిగిరావడంతో ఆర్‌బీఐ డిసెంబర్‌ సమీక్షలో మరో పావు శాతం రెపో రేటును తగ్గించి, 5.25 శాతం చేయొచ్చని అంచనా వేసింది. 2025లో 100 బేసిస్‌ పాయింట్లు (ఒక శాతం) తగ్గింపునకు ఇది అదనమని పేర్కొంది. జూన్‌ త్రైమాసికంలో (క్యూ1) 7.8 శాతం, సెప్టెంబర్‌ త్రైమాసికంలో (క్యూ2) 8.2 శాతం చొప్పున జీడీపీ వృద్ధి నమోదు కావడంతో ఫిచ్‌ రేటింగ్స్‌ తన అంచనాలను సవరించినట్టయింది. 

కాకపోతే ద్వితీయ ఆరు నెలల్లో వృద్ధి రేటు కొంత నిదానించొచ్చని పేర్కొంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026–27) భారత్‌ జీడీపీ వృద్ధి 6.4 శాతానికి తగ్గుతుందని ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. ఆర్థిక పరిస్థితులు సరళంగా మారితే వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోవచ్చని పేర్కొంది. అక్టోబర్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 0.3 శాతానికి తగ్గడం తెలిసిందే. సెప్టెంబర్‌ 22 నుంచి జీఎస్‌టీ కింద 375 ఉత్పత్తులపై రేట్లు తగ్గడం ఇందుకు అనుకూలించింది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)