Breaking News

భారత్‌లో టాప్‌ 5 బ్రాండ్‌ లిస్ట్‌లోకి యాపిల్‌

Published on Fri, 01/17/2025 - 09:23

భారతదేశంలో ఐఫోన్ అమ్మకాలను ప్రారంభించిన తరువాత మొదటిసారి యాపిల్ వాల్యూమ్ పరంగా టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ లిస్ట్‌లోకి చేరింది. 2024 అక్టోబర్-డిసెంబర్ కాలంలో 10% మార్కెట్ వాటాను సాధించింది. దేశంలో యాపిల్‌కు పెరుగుతున్న ప్రజాదరణకు ఈ విజయం నిదర్శనమని కంపెనీ తెలిపింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో యాపిల్ మార్కెట్ వాటా 8.6 శాతంగా ఉంది. ఆ సమయంలో ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 58.5% పెరిగాయి.

యాపిల్ విజయానికి ప్రధాన కారణాలు

మార్కెట్ వాటా వృద్ధి: 2024 పండుగ సీజన్‌ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో యాపిల్ 9-10% మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. ట్రేడ్-ఇన్ ఆఫర్లు, పండుగ డిస్కౌంట్లు, 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ వంటి ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించింది. దాంతో మార్కెట్ వాటా పెరిగింది.

పాపులర్ మోడల్స్: ఐఫోన్ 15, ఐఫోన్ 13 వంటి పాత మోడళ్ల కొనుగోలుకు వినియోగదారులు ఎంతో ఆసక్తి చూపించారు. ఇటీవల లాంచ్‌ చేసిన ఐఫోన్ 16 సిరీస్‌ కూడా కంపెనీ విక్రయాలు పెరిగేందుకు దోహదం చేశాయి.

స్థానికంగా తయారీ: దేశీయ తయారీపై యాపిల్ దృష్టి సారించింది. కంపెనీ విక్రయాలు గణనీయంగా పెరిగేందుకు ఇది కూడా తోడైంది. ఫాక్స్‌కాన్‌, పెగాట్రాన్, టాటా టెక్నాలజీస్‌ వంటి భాగస్వాముల ద్వారా ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ను భారత్‌లో తయారు చేస్తోంది. దేశీయంగా ఖర్చులు తగ్గించుకునేందుకు ఇది దోహదం చేస్తుంది. దాంతోపాటు భారతీయ వినియోగదారుల్లో సానుకూల బ్రాండ్ ఇమేజ్‌ను సృష్టిస్తుందని కంపెనీ నమ్ముతుంది.

ఆర్థిక కారకాలు: మధ్యతరగతి, ముఖ్యంగా యువతలో పెరుగుతున్న ఆర్థిక స్వేచ్ఛ వల్ల ప్రీమియం మోడళ్ల కొనుగోళ్లు అధికమవుతున్నాయి. యాపిల్‌ బ్రాండ్‌కు ఉన్న విలువ వల్ల ఎక్కువ మంది వీటిపై ఆసక్తి చూపుతున్నారు.

ఇదీ చదవండి: త్రైమాసిక ఫలితాలు డీలా.. కంపెనీ షేర్ల నేలచూపులు

భవిష్యత్తు అవకాశాలు

2026 నాటికి యాపిల్ మూడో అతిపెద్ద మార్కెట్‌గా భారత్ అవతరించనుందని, వార్షిక ఐఫోన్ అమ్మకాలు 15 మిలియన్ యూనిట్లకు చేరుకుంటాయని అంచనా. దేశీయ తయారీ, సమర్థవంతమైన పంపిణీ, ప్రీమియం ఆఫర్లపై కంపెనీ దృష్టి సారిస్తుండడం వంటి అంశాలు భారత మార్కెట్లో వృద్ధికి దోహదపడుతుంది.
 

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు