Breaking News

మరో ఆరు నెలల్లో దేశీయ తొలి మైక్రోకంట్రోలర్‌

Published on Mon, 03/31/2025 - 16:32

దేశీయంగా రూపొందిస్తున్న తొలి కమర్షియల్‌ మైక్రోకంట్రోలర్‌ను మరో ఆరు నెలల్లో ఆవిష్కరించే అవకాశం ఉందని చెన్నైకి చెందిన మైండ్ గ్రోవ్ టెక్నాలజీస్ సంస్థ సహ వ్యవస్థాపకులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ టీఆర్ శశ్వత్ తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రోటోటైపింగ్ పూర్తి చేసి టెస్టింగ్‌ తర్వాత అవసరమైన డిజైన్ మార్పులు చేసినట్లు చెప్పారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నాటికి చిప్‌ను లాంచ్ చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

స్మార్ట్ వాచ్‌లు, హెడ్ ఫోన్‌లు, కనెక్టెడ్ హోమ్ డివైజెస్ (స్మార్ట్ లాక్‌లు, స్పీకర్లు, స్మార్ట్ ఫ్యాన్‌లు), స్మార్ట్ సిటీ పరికరాలు (విద్యుత్, నీరు, గ్యాస్ మీటర్లు), యాక్సెస్ కంట్రోల్ పరికరాలు (బయోమెట్రిక్స్), థర్మల్ ప్రింటర్లు, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) యంత్రాలు వంటి పరికరాల్లో ఈ మైక్రోకంట్రోలర్లను ఉపయోగించనున్నారు. ఇది నిర్దిష్ట పరికరాలు లేదా అవి చేసే పనులను నియంత్రించడానికి రూపొందిస్తున్నారు.

ఇదీ చదవండి: ఫిబ్రవరిలో క్రెడిట్‌ కార్డుల జారీ ఎలా ఉందంటే..

మైక్రో కంట్రోలర్లు అవసరమయ్యే కంపెనీలతో సంస్థ ఒప్పందాలను ఖరారు చేసిన తర్వాత ఏ మేరకు ఉత్పత్తి చేయాలో నిర్ణయిస్తామని శశ్వత్ తెలిపారు. హై-పెర్ఫార్మెన్స్ ఎడ్జ్ కంప్యూటింగ్, వీడియో ప్రాసెసింగ్ అప్లికేషన్ల కోసం ఈ మైక్రోకంట్రోలర్లను ఉపయోగిస్తున్నారని చెప్పారు. సీసీటీవీ కెమెరాలు, వీడియో రికార్డర్లు, ఎలక్ట్రానిక్‌ ఆటోమోటివ్ పరికరాలు, స్మార్ట్ టీవీలు.. వంటి డివైజ్‌ల్లో ఈ చిప్‌లను వాడబోతున్నట్లు పేర్కొన్నారు. డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద చిప్ అభివృద్ధికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నుంచి గత ఏడాది సెప్టెంబర్‌లో అనుమతి లభించిందన్నారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)