Breaking News

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీలోకి అదానీ స్టాక్‌

Published on Sat, 05/25/2024 - 14:40

అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో నమోదుకానుంది. ఐటీ సంస్థ విప్రో ఈ జాబితా నుంచి బయటకువెళ్లనుంది. సెన్సెక్స్‌ 50 సూచీలో టాటా గ్రూప్‌కు చెందిన ట్రెంట్‌ లిమిటెడ్‌ చేరింది. ఈ సూచీలో నుంచి దివీస్‌ బయటకు వెళ్లింది. ఈ మేరకు ఎస్‌అండ్‌పీ డౌజోన్స్‌ సూచీ, బీఎస్‌ఈ జాయింట్‌ వెంచర్‌ ఆసియా ఇండెక్స్‌ ప్రకటిన విడుదల చేశాయి. ఈ మార్పులు జూన్‌ 24 నుంచి అమల్లోకి వస్తాయి.

అదానీ గ్రూప్‌ కంపెనీల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సెన్సెక్స్‌ 30 సూచీలోకి వస్తుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. కానీ అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌కు ఆ అవకాశం దక్కింది. ఏడాది కాలంగా ఈ కంపెనీ షేర్లు స్థిరంగా రాణిస్తుండడంతో ఈ అవకాశం దక్కినట్లు తెలిసింది. అదానీ కంపెనీల్లో సెన్సెక్స్‌ 30 సూచీలో చోటు దక్కించుకున్న తొలి కంపెనీ అదానీ పోర్ట్స్‌ కావడం విశేషం.

అదానీ పోర్ట్స్ అండ్‌ సెజ్‌ లిమిటెడ్‌ను 1998లో స్థాపించారు. అహ్మదాబాద్‌ కేంద్రంగా దేశంలోని వివిధ పోర్ట్‌లను ఆపరేట్‌ చేసే లాజిస్టిక్స్ కంపెనీగా ఎదిగింది. దేశవ్యాప్తంగా 12 పోర్ట్‌లు, టెర్మినల్స్ ఈ సంస్థ పరిధిలో పనిచేస్తున్నాయి. ఇందులో దేశంలోనే  మొట్టమొదటి డీప్ వాటర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్ విజింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ తిరువనంతపురం, ముంద్రాలోని పోర్ట్ సెజ్‌ ప్రధానమైనవి. ఈ కింది పోర్ట్‌లు అదానీ పోర్ట్‌ అండ్‌ సెజ్‌లో భాగంగా ఉన్నాయి.

  • విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయం తిరువనంతపురం

  • ముంద్రా పోర్టు 

  • కృష్ణపట్నం ఓడరేవు

  • కారైకాల్ పోర్టు 

  • హజీరా పోర్టు

  • ధమ్రా పోర్టు

  • దహేజ్ పోర్టు 

  • గంగవరం ఓడరేవు 

  • వైజాగ్ టెర్మినల్ 

  • మోర్ముగో టెర్మినల్ 

  • కట్టుపల్లి ఓడరేవు 

  • కామరాజర్ పోర్టు 

  • ట్యూనా టెర్మినల్ 

  • అగర్దానా షిప్‌యార్డ్ & టెర్మినల్స్ 

  • డిఘి పోర్టు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)