Breaking News

'నగరంలో సొంత ఇల్లు.. మీరు చేసే పెద్ద తప్పు'

Published on Thu, 09/04/2025 - 19:40

నగరంలో సొంత ఇల్లు కట్టుకోవాలనుకోవడం లేదా కొనుగోలు చేయాలనుకుకోవడం చాలామంది కల. ఈ కల నెరవేర్చుకోవడానికి ఎన్నెన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే కొందరు మాత్రం సొంత ఇల్లు ఉండాలా?, అద్దె ఇంట్లోనే ఉండాలా? అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడంలోనే మునిగిపోతారు. ఈ ప్రశ్నకు చాన్నాళ్ల నుంచే వాదోపవాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపై తాజాగా ఫిన్‌ఫ్లూయెన్సర్ 'అక్షత్‌ శ్రీవత్సవ' స్పందించారు.

''భారతదేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఇళ్లు కొనడం అంటేనే.. మీరు చేసే అతిపెద్ద తప్పులలో ఒకటి. ఎందుకంటే ఈ మార్కెట్ మొత్తం బిల్డర్ల నియంత్రణలోనే ఉంటుంది.. కాబట్టి ఇల్లు కొనాలంటే ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. అంతే కాకుండా మౌలిక సదుపాయాల సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ తరువాత మీరు ఆ ఇల్లును అమ్మడం కూడా ఒక పెద్ద సవాలు. కాబట్టి అద్దెకు తీసుకోండి, ప్రశాంతంగా జీవించండి'' అని అక్షత్‌ శ్రీవత్సవ అన్నారు. ఒకవేళా ఇల్లు కొనాలంటే.. తప్పకుండా 30 ఏళ్లు నివసించడానికి ఉండే దాన్ని కొనండి అని సూచించారు.

ప్రస్తుతం శ్రీవత్సవ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వినియోగదారులు ఇంటిని సొంతం చేసుకోవడం వల్ల గణనీయమైన రాబడి వస్తుందని చెబుతున్నారు. సొంత ఇల్లు ఉంటె అద్దె వంటివి తగ్గుతాయని ఇంకొందరు చెబుతున్నారు. చాలా మంది వినియోగదారులు ఇల్లు కొనడం దీర్ఘకాలిక సంపదను పెంచుతుందని.. స్థిరత్వాన్ని అందిస్తుందని వాదించారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)